Film industry:చిత్ర సీమలో ఒకవైపు విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సరిగ్గా మూడు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో పోరాడుతూ.. తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త మరువక ముందే ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ కన్నుమూయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ చిత్ర నిర్మాత జార్జ్ పియస్ తరయిల్.. 63 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. రెండు దశాబ్దాలకు పైగా కెరియర్ సాగించిన ఒక అనుభవజ్ఞుడైన నిపుణుడిని ఇండస్ట్రీ కోల్పోవడం దక్షిణ భారత చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన అక్టోబర్ 5వ తేదీన మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా సినీ నటుడు, చిత్ర నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా తన సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. “జార్జ్ పియస్ తరయిల్ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ స్మారక సందేశంతో నివాళులు అర్పించారు. స్నేహితులు, సహోద్యోగులు , సినీ ప్రేమికులు కూడా ఈయనతో ఆత్మీయత, వృత్తి నైపుణ్యం, భారతీయ సినిమాకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సంతాపం తెలుపుతున్నారు.
ALSO READ:మరో గోల్డెన్ ఆఫర్ పట్టేసిన అనస్వర రాజన్.. నిన్న చిరు.. నేడు?
నిర్మాత జార్జ్ పియస్ తరయిల్ కెరియర్ విషయానికి వస్తే.. తమిళ్ , హిందీ, మలయాళం చిత్ర సినిమాలలో లైన్ ప్రొడ్యూసర్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అలాగే ప్రొడ్యూసర్ గా ఎన్నో ప్రాజెక్టులకు నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గొప్ప గొప్ప చిత్రాలకు తెర వెనుక సహకారం అందించి, విపరీతమైన పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఈయన నిర్మించిన చిత్రాలలో కమల్ హాసన్ నటించిన పాపనాశం, అజిత్ నటించిన బిల్లా 2 తో పాటు మిత్ర , మై ఫ్రెండ్ అలాగే థ్రిల్లర్ మూవీ ది బాడీ చిత్రాలకు ఈయన నిర్మాతగా వ్యవహరించారు. రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన కృషి, భారతీయ చిత్ర నిర్మాణానికి తెరవెనుక గణనీయమైన తోడ్పాటును అందించింది.
ఈయన నిర్మించిన చిత్రాల విషయానికొస్తే.. 2004లో ఫిర్ మిలేంగే, 2011లో 180, 2012 బిల్లా టు, 2015 పాపనాశం, 2017 కేర్ ఫుల్, 2023 అప్పత వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2026లో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ హారర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లా చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన, ఎల్ 2: ఎంపురాన్, ది బాడీ, నవరస, మే, దృశ్యం వంటి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.