Tatkal Ticket Booking Tips: ముందుగా ప్లాన్ చేసుకుంటే టికెట్ల బుకింగ్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, అప్పటికప్పుడు టికెట్లు కావాలంటే కాస్త ఇబ్బంది తప్పదు. అత్యవసరం అనుకున్న వాళ్లు తత్కాల్ టికెట్ల కోసం ప్రయత్నిస్తారు. అయితే, తత్కాల్ టికెట్ల బుకింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే తప్పకుండా కన్పామ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ టిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ప్రయాణానికి ముందు రోజు తత్కాల్ టికెట్ల బుకింగ్
IRCTCలో తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రయాణానికి ఒక్కరోజు ముందు అనుమతిస్తారు రైల్వే అధికారులు. AC క్లాస్ ల కోసం ఉదయం 10 గంటలకు టికెట్స్ బుకింగ్ మొదలుకాగా, నాన్-AC కోసం ఉదయం 11 గంటలకు బుకింగ్ ఓపెన్ అవుతుంది. మీరు కచ్చితంగా కన్ఫామ్ టికెట్ పొందాలంటే IRCTC మాస్టర్ లిస్టును ఉపయోగించుకోవాలి. AC క్లాసులకు అంటే 1A, 2A, 3A, CC, ECకి సంబంధించిన తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. టికెట్లు పొందాలనుకునే ప్రయాణీకులు ఉదయం 9:45 గంటల లోపు లాగిన్ అవ్వాలి. అదే సమయంలో, నాన్-ఎసి క్లాసులకు అంటే, SL, 2S తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటల నుంచి మొదలవుతుంది. సో.. ప్రయాణీకులు 10:45 గంటల లోపు లాగిన్ కావాలి.
ఈ సమయంలో IRCTCకి లాగిన్ కాకండి!
తత్కాల్ టికెట్లు పొందాలనుకునే వినియోగదారులు IRCTCకి చాలా త్వరగా లాగిన్ కాకూడదు. అలాగే చివరి రెండు నిమిషాల్లో లాగిన్ కాకూడదు. అలా చేయడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ తో లాగిన్ ఆలస్యం అవుతుంది.
Read Also: స్ట్రీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు.. ప్రపంచాన్ని ఏలబోతున్న ఎలన్ మస్క్ రోబో ట్యాక్సీలు!
IRCTC కోసం మాస్టర్ జాబితాను రెడీ చేసుకోండి
తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించే సమయంలో ముందుగా మాస్టర్ లిస్టును రెడీ చేసుకోవాలి. ఇందులో కావాల్సిన సీటు వివరాలు, ప్రయాణీకుల వివరాలు, ఫుడ్ సహా ఇతర ప్రాధాన్యతలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
IRCTCలో మాస్టర్ లిస్టుతో లాభాలు
ఇక IRCTC కోసం మాస్టర్ లిస్టు రెడీగా ఉండటం వల్ల తత్కాల్ టికెట్లను ఈజీగా, ఫాస్ట్ గా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అధిక ట్రాఫిక్ ను తట్టుకుని కన్ఫామ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. మాస్టర్ లిస్టు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల గ్రూప్ టికెట్లను కూడా ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. ఈ డేటా అనేది ఎప్పుడైనా టికెట్లు బుక్ చేసుకునూ సమయంలో ఉపయోగపడుతుంది. మొత్తంగా తత్కాల్ టికెట్లు పొందాలంటే 14 నిమిషాల టైమ్ అనేది అత్యంత కీలకం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ టైమ్ లో టికెట్లు బుక్ చేసుకుంటే కచ్చితంగా కన్ఫామ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
Read Also: హైదరాబాద్ నుంచి శబరిమలకు స్పెషల్ రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం