Beauty Challenge: ప్రతి ఒక్కరూ తమ చర్మం కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యకరమైన , మెరిసే చర్మం మీ అందాన్ని పెంచడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం వేలల్లో ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. 7 రోజు పాటు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే సరిపోతుంది. మరి ఈ ఛాలెంజ్‌లో 7 రోజుల పాటు స్కిన్ కేర్ రొటీన్ ఎలా పాటించాలి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చడంలో ఎలా సహాయపడుతుందనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1 వ రోజు- స్కిన్ కేర్:
మొదటి రోజే మీ చర్మ రకాన్ని అర్థం చేసుకోండి. మీ చర్మం జిడ్డుగా, పొడిగా, మిశ్రమ లేదా సున్నితంగా ఉందా? తెలుసుకోండి. దాని ప్రకారమే మీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎంచుకోండి. ఉదయం, రాత్రి క్లెన్సింగ్, టోనింగ్ , మాయిశ్చరైజింగ్ చేర్చండి. అలాగే, సన్‌స్క్రీన్ అప్లై చేయడం అస్సలు మర్చిపోవద్దు.
2వ రోజు- క్లీనప్:
రెండవ రోజు మీ స్కిన్ శుభ్రం చేసుకోండి. పుష్కలంగా నీరు తాగండి. అంతే కాకుండా గ్రీన్ టీ లేదా నిమ్మకాయ నీరు వంటి హెర్బల్ టీలు తాగడం కూడా మంచిదే. దీనివల్ల శరీరం నుండి వ్యర్థ పదార్థాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది. అలాగే, జంక్ ఫుడ్ , చక్కెరకు దూరంగా ఉండండి.
3వ రోజు- ఎక్స్ ఫోలియేషన్:
మూడవ రోజు మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయండి. మృత చర్మ కణాలను తొలగించడం వల్ల చర్మం రంగు మెరుగుపడి, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందుకోసం తేలిక పాటి ఎక్స్ ఫోలియేటర్‌ను ఉపయోగించండి. చర్మాన్ని ఎక్కువగా రుద్దకుండా ఉండండి. దీని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
4వ రోజు- ఫేస్ మాస్క్ :
నాల్గవ రోజు మీ చర్మానికి పోషణ అందించండి. ముల్తానీ మిట్టి మాస్క్ అయినా లేదా తేనె ,పాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేయండి. ఈ ఫేస్ మాస్క్‌లు చర్మాన్ని లోతుల నుండి శుభ్ర పరుస్తాయి . అంతే కాకుండా మెరిసేలా చేస్తాయి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు కూడా వీటిని ఉపయోగించవచ్చు.
5వ రోజు- ఆరోగ్యకరమైన ఆహారం:
ఐదవ రోజు మీరు తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. నారింజ, నిమ్మ, కివీ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినండి. అలాగే మీ ఆహారంలో ఆకుకూరలు, గింజలను చేర్చుకోండి. ఇవి మీ చర్మాన్ని లోపలి నుండి పోషిస్తాయి.
Also Read: గుప్పెడు శనగలతో.. ఉక్కు లాంటి శరీరం !
6వ రోజు – బాగా నిద్రపోండి:
ఆరవ రోజు బాగా నిద్రపోండి. చర్మానికి 7-8 గంటల గాఢ నిద్ర చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల ముఖం మీద నల్లటి వలయాలు వంటి సమస్యలు వస్తాయి. పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకుని, శుభ్రమైన దిండు కవర్ వాడండి.
7వ రోజు- ఒత్తిడి :
ఏడవ రోజు ఒత్తిడిని తగ్గించడంపై దృష్టి పెట్టండి. యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి . ఒత్తిడి చర్మానికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది మొటిమలు, ముడతలను పెంచుతుంది. అందుకే సంతోషంగా ఉండండి. మీ చర్మం సహజంగా మెరుస్తూ ఉండనివ్వండి.