Tollywood:గత పది సంవత్సరాల వెనక్కి చూసుకుంటే.. టాలీవుడ్ కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేది.. కానీ ఇప్పుడు అలా కాదు.. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాదు.. ప్రపంచ స్థాయి గుర్తింపును కూడా దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే దర్శకులు, నటీనటులు తమ ఉనికిని చాటుకోవడానికి బాగా కష్టపడుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రాష్ట్రాల బౌండరీలు దాటేసి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ విదేశాలలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా యుఎస్ లో తెలుగు హీరోలకు ఎప్పటినుంచో మంచి మార్కెట్ ఉంది. కానీ కొన్ని సినిమాలు ఎవరు ఊహించని కొత్త మార్కెట్లోకి కూడా అడుగు పెడుతున్నాయి. అలా తెలుగు సినిమాలకు మార్కెట్ ఓపెన్ అయిన దేశాలలో జపాన్ కూడా ఒకటి.
కల్కి సినిమాతో అక్కడ ప్రభాస్ మార్కెట్ డౌన్ అయిందా..?
రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమా జపాన్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతకుమించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక అక్కడ ఇండియన్ సినిమాలకు సంబంధించి, అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. అయితే ఈ రెండు కూడా రాజమౌళి సినిమాలే కావడం గమనార్హం ఇకపోతే బాహుబలి సినిమా హీరో ప్రభాస్ (Prabhas) నుంచి వచ్చిన చివరి చిత్రం కల్కి(Kalki 2898AD) ఈ సినిమాని జపనీస్ లో అనువదించి బాగా ప్రమోట్ చేసి మరీ రిలీజ్ చేశారు. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక విడుదలైన తర్వాత దీని గురించి అక్కడ పెద్దగా డిస్కషన్ కూడా లేకపోవడం గమనార్హం.పైగా ప్రభాస్ బాహుబలి తో క్రేజ్ దక్కించుకున్నారు కానీ కల్కి సినిమాతో తన మార్కెట్ ను డౌన్ చేసుకున్నారనే వార్తలు వినిపించాయి.
దేవరతో ఎన్టీఆర్ సత్తా చాటుతారా..?
ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) జపాన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన నటించిన చివరి సినిమా దేవర (Devara ). జపనీస్ లో మార్చి 28న విడుదల చేయబోతున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ జపాన్ అభిమానులతో ఆన్లైన్ వీడియో చిట్ చాట్ కూడా చేశారు. ఇక త్వరలోనే తారక్ జపాన్ కి వెళ్లి తన సినిమాను కూడా ప్రమోట్ చేయబోతున్నారు. ఇక వాస్తవానికి తారక్ ఆర్ఆర్ఆర్ చేయడానికి కంటే ముందే జపాన్లో కొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అక్కడి నుంచి తనకోసం అభిమానులు ఇండియాకి కూడా వస్తూ ఉంటారు. అయితే కల్కి లాంటి విజువల్ వండర్ని జపాన్ ప్రేక్షకులు పట్టించుకోని నేపథ్యంలో.. మరి దేవర సినిమా ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్టీఆర్ అక్కడ మార్కెట్ పెంచుకోవాలనుకుంటే ఇంకేదైనా పెద్ద మూవీ ఈవెంట్ తో వెళ్లాలి. దేవర అటు తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుముందు. అలాంటిది విదేశాల్లో సత్తా చాటుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే ప్రభాస్ కల్కిని జపాన్ ప్రేక్షకులు మెచ్చుకోలేదు. కాబట్టి మరి దేవర సినిమాతోనైనా ఎన్టీఆర్ ఎంత మేరా జపాన్లో సేల్ చేయగలడో చూడాల్సి ఉంది. మరి ప్రభాస్ వల్ల కానిది ఎన్టీఆర్ వళ్ళైనా అవుతుందేమో చూడాలి అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.