BigTV English
Advertisement

Block Unwanted Youtube Videos : యూట్యూబ్‌లో పిల్లలకు అనవసర వీడియోలు కనిపిస్తున్నాయా?.. ఈ సెట్టింగ్స్ మారిస్తే సరి!

Block Unwanted Youtube Videos : యూట్యూబ్‌లో పిల్లలకు అనవసర వీడియోలు కనిపిస్తున్నాయా?.. ఈ సెట్టింగ్స్ మారిస్తే సరి!

Block Unwanted Youtube Videos Restricted Mode | ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యూబ్ లో వీడియోలు వీక్షిస్తున్నారు. ఈ యాప్ ప్రధానంగా వినోదం కోసం ప్రారంభించినప్పటికీ.. ఇప్పుడు ఇందులో అన్ని రకాల కంటెంట్‌ను అందుబాటులోకి ఉంది. కానీ చాలా సార్లు ప్రజలు అనవసరమైన వీడియోలను కూడా శోధిస్తారు. దీని వల్ల వారు తరువాత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. చాలా సార్లు ఇలాంటి అసభ్య వీడియోలు సెర్చ్ ఫీడ్‌లో కూడా కనిపిస్తాయి.
ఈ వీడియోలు ఎప్పుడైనా మీ ఫోన్ లేదా ఇతర డివైస్ లో మీ కుటుంబసభ్యులు లేదా పిల్లలకు కనిపిస్తే.. ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే అలాంటి వీడియోలు పైన కనబడకుండా ఒక సులభమైన సెట్టింగ్ ద్వారా ఆపవచ్చు. అప్పుడు మీ పిల్లలకు నిరభ్యతరంగా మీ ఫోన్ ఇవ్వొచ్చు.


ఇందుకోసం ముందుగా మీరు మీ ఫోన్‌లో YouTube యాప్‌ను తెరవాలి. ఆ తర్వాత మీ ప్రొఫైల్‌కి వెళ్లి సెట్టింగ్స్‌ ఎంపిక చేసుకోండి. ఆ వెంటనే జనరల్ ఆప్లషన్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత, కొంచెం స్క్రోల్ చేయండి.. కింద మీకు రిస్ట్రిక్టెడ్ (Restricted)మోడ్ కనిపిస్తుంది. అక్కడ మీకు ముందు ఒక బటన్ కనిపిస్తుంది. మీరు దాన్ని ఎనేబుల్ అంటే ఆన్ చేయండి. మీరు బటన్‌ను ఆన్ చేసిన తరువాత, అప్లై కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్‌ని ఆన్ చేశాక మీ YouTube ఫీడ్‌లో అసభ్య కంటెంట్ తో ఉండే వీడియోలు కనిపించవు. ఇక ధైర్యంగా మీ ఫోన్‌ను మీ పిల్లలకు కూడా ఇవ్వవచ్చు.

దీంతో పాటు చాలాసార్లు ఇలాంటి ఇతర భాషా వీడియోలు చూస్తుంటాం. దీని వల్ల ఆ భాష అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కానీ యూట్యూబ్ వీడియోలలో సబ్‌టైటిల్స్ ఆన్ చేయడం ద్వారా ఆ వీడియోను మీరు మీ సొంత భాషలో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆప్షన్ కోసం ఒక చిన్న పని మీరు చేయాల్సి ఉంటుంది. మీరు యూట్యూబ్‌ వీడియోను ప్లే చేసినప్పుడల్లా కింద మీకు CC అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేయండి. అంతే మీకు ఆ వీడియో ప్లే అవుతున్నప్పుుడ కనిపించే సీన్స్ ప్రకారం.. కింద టెక్స్ట్‌ కనిపిస్తూ ఉంటుంది. వాటిని సులభంగా చదవచ్చు. వీడియో కంటెంట్‌ను వీక్షించడంలో మీకు ఎటువంటి సమస్య ఉండదు.


Also Read: ఏసీతో కరెంటు బిల్లు వాచిపోతోందా.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్!

పిల్లలు ఏ యాప్‌నైనా ఉపయోగించకుండా నిషేధించాలి

ఒక వైపు.. ప్రపంచంలో డిజిటలైజేషన్ మన పనిని సులభతరం చేసింది. మరోవైపు దాని ప్రతికూలతలు కూడా కనిపించాయి. దీనికి సంబంధించి ఒక సర్వే బయటపడింది. ఈ సర్వే ప్రకారం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని యాప్‌లు మూసివేయాలని కోరుకుంటున్నారు. నిజానికి, ఒక పిల్లవాడు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడల్లా అతను తన వయస్సు గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా లాగిన్ అవుతాడు.

సర్వేలో వారి పిల్లలు తప్పు వయస్సు ఇచ్చి యాప్‌లోకి లాగిన్ అయితే వారి పిల్లల అకౌంట్లను మూసివేయాలని స్పష్టమవుతోంది. ఒక పిల్లడు (మైనర్) ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తే.. దానికి ముందు ఆ మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు పిల్లల వయస్సును ధృవీకరించాలి. దీంతోపాటు ఆ పిల్లల డేటాను ప్రాసెస్ చేసే ముందు వారి తల్లిదండ్రుల సమ్మతిని కూడా తప్పనిసరిగా పొందాలి.

తల్లిదండ్రులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు: యాప్‌లలో సైన్ అప్ చేసేటప్పుడు చాలా మంది పిల్లలు తమ వయస్సు గురించి తప్పుడు వివరాలు ఇస్తారని కొంతమంది తల్లిదండ్రులు నమ్ముతున్నారని సర్వే నివేదిక పేర్కొంది. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో వెరిఫికేషన్ (ధృవీకరణ) లేనందున, పిల్లలు సులభంగా సైన్ అప్ చేస్తున్నారు. సర్వే చేయబడిన తల్లిదండ్రులలో 88 శాతం మంది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) నియమాలకు మద్దతు ఇచ్చారు. ప్లాట్‌ఫారమ్‌లు అలాంటి ఖాతాలను గుర్తించాలని చెప్పారు.

అలాగే వారి తల్లిదండ్రుల సమ్మతి కూడా తీసుకోవాలి. సమ్మతి పొందకపోతే, ఖాతాలను మూసివేయాలి. సర్వేలో మొత్తం 21,760 మంది తల్లిదండ్రులలో కేవలం 4 శాతం మంది మాత్రమే వయస్సు నమోదు లేకుండా ప్లాట్‌ఫారమ్‌లను నిరంతరం ఉపయోగించడాన్ని సమర్థించారు.

మిగిలిన 22,518 మంది తల్లిదండ్రులలో 58 శాతం మంది ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లు పిల్లల వయస్సును గుర్తించాలని సూచించారు. ఈ సర్వే డిసెంబర్ 27 నుండి ఫిబ్రవరి 23 వరకు నిర్వహించారు. ఇందులో దేశంలోని 349 జిల్లాల నుండి పాఠశాల పిల్లల తల్లిదండ్రుల నుండి 44,000 కంటే ఎక్కువ స్పందనలు వచ్చాయి.

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×