HHVM Release date:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులకు ఇది అద్భుతమైన శుభవార్త అని చెప్పవచ్చు. అసలే రాజకీయాలలో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభిమానులను మరిచిపోయారేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులకు ఇది భారీ న్యూస్ అని చెప్పవచ్చు. తాజాగా తాను నటిస్తున్న మూడు సినిమాలలో ఒక సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇది కదా అసలైన పండుగ అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ లాక్..
ఇక అసలు విషయంలోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధి అగర్వాల్ (Nidhi Aggrawal)హీరోయిన్ గా.. జ్యోతి కృష్ణ(Jyoti Krishna)దర్శకత్వంలో ఎం.ఎం. కీరవాణి (MM.Keeravani)సంగీతాన్ని అందిస్తూ విడుదల కాబోతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. గతంలో మే 9వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఇది ఎంతవరకు నిజమని అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేస్తూ సమ్మర్ స్పెషల్ గా మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేసింది చిత్ర బృందం. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే విడుదల తేదీకి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో చెప్పిన టైంకి సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కాబట్టి “అటు రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తిస్థాయిలో వేగంగా జరుగుతున్నాయి. మెరుపు వేగంతో హద్దులు దాటుతున్నాయి. వేసవిలో అతిపెద్ద సినిమాటిక్ దృశ్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధం అవుతున్నామంటూ” పోస్టర్ తో పాటు ఈ విషయాన్ని కూడా షేర్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే ఈ సినిమా ఖచ్చితంగా అరుదైన రికార్డులు క్రియేట్ చేస్తుందని అటు అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.
Krish 4: రూమర్స్ కి చెక్.. హృతిక్ తో రొమాన్స్ కి సిద్ధమైన హీరోయిన్..!
బిజీగా మారిన పవన్ కళ్యాణ్..
ఇక పవన్ కళ్యాణ్ విషయానికే వస్తే.. ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజా పాలనలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. మరోవైపు తన కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich) సింగపూర్లో అగ్నిప్రమాదంలో ఇరుక్కోవడంతో ప్రస్తుతం బాలుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉండగా.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ అక్కడే ఉన్నారు. ఇక ఇప్పుడు పైగా చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , పాటలు ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
No Change in Release Date🤗 #HariHaraVeeraMallu
Releasing on May 9th, As Scheduled 📷 👍Only 2 days Shoot Pending For #pawanKalyan & one / Two Days For Dubbing#PawanKalyan #AMRatnam #BIGTVcinema@PawanKalyan pic.twitter.com/GWawdZy7au
— BIG TV Cinema (@BigtvCinema) April 11, 2025