Fire Safety Tips: రీసెంట్ గా పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్ లోని టొమాటో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. ఆ తర్వాత మార్క్ కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. నిజానికి అగ్ని ప్రమాదం సమయంలో మనుషుల ప్రాణాలు తీయడంలో మంట కంటే పొగే కీలక పాత్ర పోషిస్తుంది. పొగ శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. వెంటనే మనుషులు మూర్చపోయేలా చేస్తుంది. ఆ తర్వాత ప్రాణాలు పోయేందుకు కారణం అవుతుంది. అగ్ని ప్రమాద సమయంలో పొగ నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అగ్ని ప్రమాదం నుంచి ఎలా కాపాడుకోవాలి?
⦿ ఇంట్లో, ఆఫీసులో స్మోక్ అలారమ్ ను ఇన్ స్టాల్ చేయాలి.
⦿ ప్రతి గదిలో, హాలులో, నేలపై స్మోక్ అలారాలను ఉంచాలి.
⦿ ప్రతి నెలా వాటిని గమనించాలి.2 ఏళ్లకు ఓసారి బ్యాటరీలను మార్చాలి.
⦿ ఫైర్ ఎస్కేప్ ప్లాన్ చేయాలి. ప్రతి గది నుంచి 2 దారులు ఉండేలా చూసుకోవాలి.
⦿ అత్యవసర సమయంలో ఫ్యామిలీ అంతా సేఫ్ గా బయటపడేలా చూసుకోవాలి.
⦿ మంటలు ఆర్పే సిలిండర్ ను అందుబాటులో ఉంచుకోవాలి.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి?
⦿ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ బయటకు పోయేలా చూసుకోవాలి.
⦿ కిటికీలకు ఏ వస్తువులు అడ్డుగా లేకుండా చూసుకోవాలి.
మంటలు వ్యాపించినప్పుడు సేఫ్ గా ఎలా ఉండాలి?
⦿ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫ్లోర్ మీద పడుకోవాలి.
⦿ పొగ ఊపిరితిత్తులలోకి వెళ్లకుండా తడి గుడ్డను ముక్కు, నోటికి అడ్డుగా పెట్టుకోవాలి.
⦿ వెనుకవైపు తలుపులు మూసివేయాలి. మంటలు, పొగ వ్యాప్తి చెందకుండా కాపాడవచ్చు.
⦿ అగ్ని ప్రమాద సమయంలో లిఫ్టులను కాకుండా మెట్ల మీదుగా బయటకు వెళ్లండి.
⦿ మీ దుస్తులకు మంటలు అంటుకుంటే, పరిగెత్తడం ఆపండి. మంటలను ఆర్పడానికి నేలపై పడుకొని దొర్లండి.
అగ్ని ప్రమాద సమయంలో ఇంట్లో చిక్కుకుంటే?
⦿ అగ్ని ప్రమాద సమయంలో ఇంట్లో చిక్కుకుంటే పొగ లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
⦿ అత్యవసర సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేయండి.
Read Also: పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లి మరీ రీల్స్.. నాగర్ కర్నూల్ కుర్రాళ్ల వెర్రి చేష్టలు!
అగ్ని ప్రమాదం జరగకుండా అదనపు భద్రతా చిట్కాలు
⦿ ఇంట్లో కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్లను ఇన్ స్టాల్ చేయాలి. ఇవి ప్రమాదకరమైన వాయువు గురించి ముందుగానే హెచ్చరిస్తాయి.
⦿ ఇంటిని నిర్మించేటప్పుడు అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించండి.
ఇంట్లో లేదంటే ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించాలి. మంటల కంటే పొగ ప్రమాదం అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత త్వరగా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలి.