Air Cooler Tips: సమ్మర్ టైం రానే వచ్చింది. ఇలాంటి వేళ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కూలర్‌లు వినియోగిస్తున్నారు. కానీ, కూలర్ వాడుతున్న క్రమంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేయవచ్చని అంటున్నారు. దీంతోపాటు కూలర్ ఎలా వినియోగించాలనే అంశాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం.
సరైన స్థానం, సమర్థవంతమైన గాలి ప్రసరణ
ఎయిర్ కూలర్‌ను గదిలో ఎక్కడ ఉంచితే బాగా పనిచేస్తుందో తెలుసా? గాలి ప్రవాహం బాగా ఉండే చోట. ఓపెన్ విండో పక్కన ఉంచితే చాలు, కూలర్ చల్లని గాలిని గదిలోకి పంపుతూ, వేడిమి గాలిని బయటకి తోసేస్తుంది. గాలి ప్రొపర్‌గా సర్క్యులేట్ అయితే, కూలర్‌కి ఎక్కువ శక్తి అవసరం ఉండదు. అందుకే కూలర్‌ను మూసివేసిన గదిలో కాకుండా, సరిగ్గా వెంటిలేషన్ ఉన్న చోట పెట్టాలి.
వాటర్ పంప్ ఆన్
ఎయిర్ కూలర్‌లు వాటర్ బేస్‌డ్ కూలింగ్ మీద ఆధారపడి పనిచేస్తాయి. కానీ ప్రతి సారి పంప్ ఆన్ చేయడం అవసరం ఉండకపోవచ్చు. వాతావరణం తేమగా ఉన్నప్పుడు (హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు), వాటర్ పంప్‌ను ఆఫ్ చేసి కేవలం ఫ్యాన్‌ను మాత్రమే ఆన్ చేస్తే చాలు. దీని వల్ల unnecessary power consumption తగ్గుతుంది. అలాగే, వాటర్ కూడా ఆదా అవుతుంది.
రెగ్యులర్‌గా శుభ్రం చేయడం
కూలర్ ప్యాడ్‌లు, ఫ్యాన్ బ్లేడ్‌లు, వాటర్ ట్యాంక్ వంటి వాటిపై దుమ్ము పేరుకుంటే, మోటార్ ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ప్రతి పది రోజులకు ఓసారి కూలర్‌ను పూర్తిగా శుభ్రం చేయండి. ప్యాడ్‌లు చాలా కాలంగా మార్చకపోతే, కొత్తవి మార్చండి.
మీ గది పరిమాణానికి తగిన కూలర్
చిన్న గదిలో పెద్ద కూలర్ పెట్టితే ఏం జరుగుతుందో తెలుసా? అవసరం లేకపోయిన కూలింగ్, ఇటు అవసరంలేని power consumption. అలాగే పెద్ద గదికి చిన్న కూలర్ పెట్టినా సరిపోదు. అందుకే, మీ గది square feet ఆధారంగా తగిన కూలర్‌నే ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.
టైమర్ ఫంక్షన్
నిద్రలో వెళ్లిన తర్వాత కూలర్ ఆఫ్ చేయడం మనం మర్చిపోతుంటాం. ఫలితంగా రాత్రంతా దానంతట అదే పని చేస్తూ ఉంటుంది. దీని వల్ల విద్యుత్ వృథా అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం టైమర్ సెట్టింగ్. కొన్ని కూలర్‌లలో టైమర్ ఆప్షన్ ఉన్నా మనం ఉపయోగించము. కానీ అది ఉపయోగించాలసిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. లేకపోతే స్మార్ట్ ప్లగ్‌లతో ఆటో ఆఫ్ ఫీచర్ పెట్టేయొచ్చు.
సూర్యరశ్మి పడే చోట
కూలర్‌ను నేరుగా ఎండరశ్మి పడే విండో పక్కన ఉంచితే, ట్యాంక్‌లో నీరు వేడిగా మారుతుంది. దీంతో కూలింగ్ సమర్థవంతంగా జరగదు. ఫలితంగా కూలర్‌కి ఎక్కువ శ్రమ పడుతుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచే ప్రమాదం. కాబట్టి, కూలర్‌ను చల్లగా ఉండే చోట ఉంచండి.
ఫ్యాన్ స్పీడ్ సర్దుబాటు
కొన్ని సందర్భాల్లో కూలర్‌ను పూర్తి స్పీడ్‌తో నడపాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు, ఉదయం వేళల్లో వాతావరణం తక్కువ వేడిగా ఉండే సమయాల్లో medium speed సరిపోతుంది. కానీ, మనం ఫుల్ స్పీడ్‌లోనే ఆన్ చేస్తూ ఉంటాం. ఇలా unnecessary స్పీడ్ వల్ల power consumption పెరుగుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి ఫ్యాన్ స్పీడ్‌ను సర్దుబాటు చేయాలి.
కొన్ని హైటెక్ చిట్కాలు
స్మార్ట్ ప్లగ్‌లు & స్మార్ట్ టాయిమింగ్: Wi-Fi ఆధారంగా పనిచేసే స్మార్ట్ ప్లగ్‌లతో మీరు మీ కూలర్‌ను ఫోన్ ద్వారా ఆన్/ఆఫ్ చేయవచ్చు. టైమింగ్, usage ఆప్ట్‌మైజేషన్ ఈ ప్లగ్‌లతో సులభంగా చేయొచ్చు.
Energy-efficient motors: ఇప్పుడు మార్కెట్లో కొన్ని ఎయిర్ కూలర్‌లు energy-saving motorsతో వస్తున్నాయి. ఇవి సాధారణ మోటర్లతో పోలిస్తే 30% వరకు తక్కువ విద్యుత్ వాడతాయి.