నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ఎంత తిన్నా బోర్ కొట్టదు. దానితో రకరకాల వంటలు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఓసారి కొత్తగా కేరళ స్టైల్లో కొబ్బరిపాలతో చికెన్ గ్రేవీ రెసిపీ ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోనూ, చపాతీలోనూ, రోటీలోనూ కూడా దీని తినవచ్చు. ఒకసారి వండుకొని తిన్నారంటే మీకు ఎంతో నచ్చుతుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా దీని వండడం కూడా చాలా సులువు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కొబ్బరిపాలతో చికెన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ – అరకిలో
కొత్తిమీర తురుము – ఒక స్పూను
పసుపు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కారం – ఒక స్పూను
కొబ్బరి పాలు – ఒక కప్పు
కొబ్బరి తురుము – రెండు స్పూన్లు
నెయ్యి – రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
ఉల్లిపాయ – ఒకటి
గరం మసాలా – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూనుః
జీలకర్ర పొడి – అర స్పూను
పచ్చిమిర్చి – నాలుగు
కొబ్బరి పాలతో చికెన్ గ్రేవీ రెసిపీ
⦿ కొబ్బరి పాలను ముందుగానే తీసి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
⦿ అందులో ఉల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించాలి.
⦿ ఆ తరువాతే కొత్తిమీర తురుమునకు కూడా వేసి బాగా వేయించుకోవాలి.
⦿ ఇప్పుడు ఇందులోనే చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఉప్పు రుచికి సరిపడా వేసి మూత పెట్టాలి.
⦿ చికెన్ ముక్కలు 70 శాతం ఉడికే వరకు అలాగే ఉంచాలి.
⦿ ఆ తర్వాత మూత తీసి కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
⦿ కరివేపాకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇప్పుడు కొబ్బరి పాలను వేసి మీడియం మంట మీద అరగంట సేపు ఉడికించాలి.
⦿ ఆ తర్వాత అది దగ్గరగా గ్రేవీలాగా అవుతుంది.
⦿ అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే కొబ్బరి పాలతో చికెన్ గ్రేవీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది అద్భుతంగా ఉంటుంది.
⦿ వేడివేడి అన్నంలో కలుపుకుని చూడండి. దీని రుచి ఎంత బాగుంటుందో అలాగే రోటి, పరోటా, చపాతీతో కూడా ఈ చికెన్ గ్రేవీ అదిరిపోతుంది.
⦿ ముక్కలు పెద్దవిగా కాకుండా చిన్నవిగా కట్ చేసుకుని చూడండి. బాగా ఉడుకుతాయి.
చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతీరోజు చికెన్ తినే కన్నా వారంలో రెండు మూడు సార్లు చికెన్ తినడానికి ప్రయత్నించండి. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫాస్పరస్, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే సెలీనియం మనకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఆర్థరైటిస్ వంటి ప్రమాదాల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది.
Also Read: ఆ మాటలకు మా నాన్న కృంగిపోయారు.. దయచేసి ఆపండంటున్న రకుల్..!
ఒత్తిడితో బాధపడుతున్న వారు చికెన్ ను తినడానికి ప్రయత్నించండి. చికెన్ లో విటమిన్ బి5 తో పాటు ట్రిప్టోఫోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. చికెన్ ప్రతిరోజు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతిరోజు తినాలనుకునేవారు 50 గ్రాములు కంటే ఎక్కువ తినకపోవడమే ఉత్తమం.