Wright loss: ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నా వారు బరువు తగ్గేందుకు(Weight loss) ఎన్నో ప్రయత్రాలు చేస్తారు. శరీరంలోని కేలరీలను తగ్గించుకోవడానికి వర్కౌట్స్ కూడా చేస్తారు. చాలా మంది డైటింగ్ కూడా చేస్తారు. అలాంటి వారికి డ్రింక్స్ చాలా హెల్ప్ చేస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభతరం అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా మెటబాలిజం రేటును పెంచడంలో కూడా ఇవి తోడ్పడతాయట.
తరచుగా డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు కూడా తొలగిపోతాయట. వేగంగా బరువు తగ్గాలని అనుకునే వారు కొన్ని రకాల డ్రింక్స్‌ని(Weight loss drinks) తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడానికి ముందు పర్సనల్ డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
దాల్చిన చెక్క నీరు:
బరువు తగ్గించే డ్రింక్స్ అనగానే చాలా మందికి పండ్లు, కూరగాయలతో తయారు చేసిన బేవరేజెస్ మాత్రమే గుర్తోస్తాయి. అయితే కొన్ని రకాల మసాలాలు కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల బరువు తగ్గడం మరింత సులభం అవుతుందని అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించేందుకు ఇది సహాయపడుతుందట. అంతేకాకుండా బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచేందుకు కూడా ఇవి సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే దాల్చిన చెక్కను ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మెటబాలిజం కూడా మెరుగుపడుతుందట.
సోంపు వాటర్:
అనే జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడంలో సోంపు తోడ్పడుతుంది. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే సోంపు వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఇది సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ సోంపు వాటర్ తాగాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.
ALSO READ: హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వల్ల క్యాన్సర్..?
జింజర్ లెమన్ టీ:
బరవు తగ్గేందుకు జింజర్ లెమన్ టీ ఎంతో సహాయపడుతుందని న్యూట్రీషనిస్ట్‌లు చెబుతున్నారు. అల్లంలో సహజంగానే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయట. అంతేకాకుండా జీవక్రియ మెరుగుపడడానికి అల్లం తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గాలని డైట్ చేస్తున్న వారు తరచుగా జింజర్ లెమన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. కడుపులో జీర్ణ ఎంజైమ్‌లు విడుదల కావాలంటే వీటిని తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లలో అధికంగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు ఇవి సహాయపడతాయి. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయట. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరి నీళ్లను తరచుగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ రకమైన ఆహారాన్ని డైట్‌లో చేర్చుకునే ముందు డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.