Obesity: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ 25 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అధిక బరువుగా పరిగణిస్తారు. 30 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. WHO 2022 డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఒకప్పుడు పోషకాహార లోపం, తక్కువ బరువు అనేది ఇండియాలో ఎక్కువగా వినిపించేవి. ఇక ఇప్పుడు ఇండియాలో ఊబకాయం ఉన్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం ఎక్కువగా ఉండే టాప్ 5 దేశాల్లో మొదటి 2 స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. భారత్ మూడో స్థానంలో ఉంది.
ఊబకాయం వల్ల షుగర్ మొదలుకొని గుండె జబ్బుల వరకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధికంగా ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల ఊబకాయం సమస్య వస్తుంది. అయితే దీన్ని కంట్రోల్ చేయకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడి ప్రాణాంతకమైన సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఊబకాయం ఎందుకు వస్తుంది..?
క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఒబేసిటీ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తరచుగా తీసుకునే ఆహారంలో చెడు కొవ్వులు, జంక్ ఫుడ్, పంచదార, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా ఉంటే ఈ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంది. శారీరక శ్రమ లేకుండా ఉండటం, ఎక్కువ సమయం కదలకుండా ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరే ఛాన్స్ ఉందట.
ALSO READ: పంటినొప్పి ఎందుకు వస్తుంది..?
ఊబకాయం వల్ల సైడ్ ఎఫెక్ట్స్..
ఊడకాయం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో గుండెపోటు, హైపర్ టన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఊడకాయం కారణంగా టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందట. ఒబేసిటీ వల్ల కొందరిలో ఆప్నియా వస్తే మరికొందరిలో నిద్రలేమి సమస్యలు రాబొచ్చట.
అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కారణంగా కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఊబకాయం సమస్య వల్ల కీళ్ల నొప్పులు కూడా వచ్చే ఛాన్స్ ఉందట. మరి కొందరిలో ఊబకాయం సమస్య కారణంగా డిప్రెషన్, ఆందోళన పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయం తగ్గించుకోవాలంటే..
పండ్లు, కూరగాయలు, పూర్తి ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలని డాక్టర్లు చెబుతున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు వర్కౌట్ చేయాలట. వీటితో పాటు వాకింగ్, జోగింగ్, యోగా, జిమ్‌లో వ్యాయామం చేయడం ఉత్తమం.