BigTV English

KKR Vs LSG : టాస్ గెలిచిన కోల్ కతా.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..?

KKR Vs LSG : టాస్ గెలిచిన కోల్ కతా.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..?

KKR Vs LSG :  ఐపీఎల్ మ్యాచ్ 19 కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మధ్య పోరు జరుగనుంది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుందనే చెప్పాలి. తొలుత కేకేఆర్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముఖ్యంగా లక్నో సూపర్ జాయింట్స్ టాస్ ఓడిపోయి మంచి విజయాలను సాధించింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో లక్నో తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్ లలోనే విజయం సాధించింది.


లక్నో జట్టు మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడితే 2 మ్యాచ్ లు గెలిచి.. 2 మ్యాచ్ లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుందో లక్నో సూపర్ జాయింట్స్. కేకేఆర్ కూడా 4 మ్యాచ్ లు ఆడితే 2 మ్యాచ్ లలో విజయం సాధించి 4 పాయింట్లతో 5 స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి సారిగా మంగళవారం రోజు రెండు మ్యాచ్ లు జరగడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

తొలుత విడుదల చేసి ఐపీఎల్ 2025 సెడ్యూల్ ప్రకారం.. ఇవాళ ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. ఛండీగడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 06న కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జాయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి జరుగనుంది. శ్రీరామనవమి వేడుకలు ఉన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయం కారణంగా ఐపీఎల్ 2025 షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేయాల్సి వచ్చింది.


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేకేఆర్ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. రహానే నేతృత్వంలో  ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని LSG జట్టు రెండు విజయాలు నమోదు చేసుకొని.. 2 ఓటమిలతో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్ నాలుగు ఇన్నింగ్స్ లలో కేవలం 19పరుగులు మాత్రమే చేయడంతో జట్టు ఇబ్బందులకు గురవుతోంది. 

ప్రస్తుతం అందరి చూపు రిషబ్ పంత్ వైపు ఉండటం విశేషం. ప్రస్తుతం కేకేఆర్ జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేకేఆర్ ఫ్యాన్స్ పేర్కొంటుంటే.. లక్నో జట్టే విజయం సాధిస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. లక్నో జట్టు 200 పైగా నమోదు చేస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు పేర్కొంటున్నారు.

కోల్ కతా రైడర్స్ : 

క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానె, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రె రస్సెల్, రమణ్ దీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

లక్నో సూపర్ జెయింట్స్ : 

మిచెల్ మార్ష్, మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, అయుష్ బదోనీ, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాథీ.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×