Face Pack For Dark Spots: కలబంద ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.కలబంద అనేక చర్మ సమస్యలను కూడా పరిష్కరించగలదు. ఇందులోని ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో కూడా కలబందకు విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. వడదెబ్బ, మొటిమలు, నల్లటి వలయాలు వంటి సమస్యలు ఉన్న వారు కలబందతో చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కలబందతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అలోవెరాతో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరాతో ఫేస్ ప్యాక్:
చలికాలంలో కూడా మీ ముఖం యొక్క రంగును కాపాడుకోవాలంటే.. ఇంట్లోనే కలబందతో ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది.
అలోవెరా, హనీ ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా పోషించి మృదువుగా చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలతో పోరాడటానికి సహాయపడతాయి.
కావలసినవి:
అలోవెరా జెల్: 2 tsp
తేనె: 1 tsp
తయారుచేసే విధానం:
ఒక గిన్నెలో అలోవెరా జెల్ , తేనెను బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.అనంతరం చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
అలోవెరా ,పెరుగు ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి చాలా మంచిది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని టోన్ చేస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా తగ్గిస్తుంది.
కావలసినవి:
అలోవెరా జెల్: 2 tsp
పెరుగు: 1 tsp
తయారుచేసే విధానం:
ఒక గిన్నెలో అలోవెరా జెల్ , పెరుగును వేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.అనంతరం
చల్లటి నీటితో వాష్ చేయండి.
అలోవెరా , ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా చర్మంపై ఉన్న అదనపు నూనెను గ్రహిస్తుంది. ముల్తానీ మిట్టిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.
కావలసినవి:
అలోవెరా జెల్: 2 టీస్పూన్లు
ముల్తానీ మిట్టి: 1 టీస్పూన్
రోజ్ వాటర్: కొద్దిగా
తయారుచేసే విధానం:
అలోవెరా జెల్ , ముల్తానీ మిట్టిని ఒక గిన్నెలో వేసి చిక్కని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం చల్లటి నీటితో వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల నల్ల మచ్చలు తొలగిపోతాయి.
అలోవెరా, లెమన్ ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతే కాకండా నల్ల మచ్చలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో చర్మానికి సహాయపడుతుంది.
కావలసినవి:
అలోవెరా జెల్: 2 టీస్పూన్లు
నిమ్మరసం: అర టీస్పూన్
తయారుచేసే విధానం:
ఒక గిన్నెలో అలోవెరా జెల్ , నిమ్మరసం తీసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం చల్లటి నీటితో కడగాలి.
Also Read: చుండ్రు శాశ్వతంగా తగ్గాలంటే.. ఈ ఒక్కటి వాడితే చాలు
ఇతర చిట్కాలు:
అలోవెరా జెల్ తాజాగా ఉండాలి.
ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి 2-3 సార్లు వేసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన చర్మం కోసం సమతుల్య ఆహారం తీసుకోండి. అంతే కాకుండా తగినంత నీరు త్రాగండి.