Allu Arjun Horoscope 2025 : తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కి సంబంధించి ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గత నెల రోజులుగా అల్లు అర్జున్ తీవ్రమైన వ్యతిరేకతలు, విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘పుష్ప 2’ బెనిఫిట్ షో హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్లో ప్రదర్శించారు. అక్కడికి అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. తొక్కిసలాట జరగగా, ఆ తొక్కిసలాటలో మహిళ మరణించగా.. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇలా అన్నీ కూడా అల్లు అర్జున్ మెడకు ఉచ్చులా బిగిస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించగా.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ, పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్ కాస్త వాయిదా పడుతూనే వస్తోంది. ఇక తదుపరి విచారణను జనవరి మూడవ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇలా ఈ సమస్యలన్నీ ఆయనను రోజురోజుకీ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఏడాదైనా ఆ సమస్య నుంచి ఆయన బయటపడతారా అని అభిమానులు సైతం ఆయన జాతకం గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ కృష్ణమాచార్య బన్నీ జాతకాన్ని పరిశీలించి, ఆయనకు ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు.
అల్లు అర్జున్ జాతకం పై ఆస్ట్రాలజర్ కామెంట్స్..
తాజాగా ఆస్ట్రాలజర్ కృష్ణమాచార్య గవ్వలు వేసి మరీ అల్లు అర్జున్ జాతకం ఎలా ఉండబోతోందో చూశారు. గవ్వలు వేయగా.. వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించిందని ఆయన తెలిపారు. ‘పుష్ప2’ సినిమా తర్వాత ఈయనకు సంబంధించి సినీ రంగంలో మంచి సమయం మళ్లీ వస్తుంది. కానీ ఆరు నంబరు రావడం వల్ల కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలకు దారితీస్తుంది. ప్రత్యేకించి కోర్టు వ్యవహారాలకు కారణం అవుతుంది. బహుశా పుష్ప 2 సందర్భంగా ఒక థియేటర్లో తొక్కిసలాటకు సంబంధించి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇవి ఇంకా ఈ ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఏడాది కూడా తిప్పలు తప్పవంటూ..
ఆయన జాతకాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది కొన్ని చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా అల్లు అర్జున్ న్యాయపరమైన చట్టపరమైన అంశాలలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎన్నో విషయాలలో విష్ణు దేవుడి ఆరాధన చేస్తే.. అంతా శుభమే జరుగుతుంది. సుదర్శన నారసింహ మంత్రాన్ని గాని, హనుమంత్ తంత్రాన్ని గానీ జరిపిస్తే.. న్యాయ, చట్టపరమైన సమస్యలలో ఎదురవుతున్న విపత్తుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ జాతకంలో నడుస్తున్న గ్రహగతులు బాగాలేవు కాబట్టి ఇలాంటి అనవసరమైన అపోహలు, అపనిందలు, అపార్ధాలు అల్లు అర్జున్ గారి మీద వచ్చాయి. కాబట్టి ఇప్పుడే చెప్పిన సూచనలు పాటిస్తే తప్పకుండా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అని ఆయన తెలియజేశారు. మరి అల్లు అర్జున్ తన సమస్య నుంచి బయటపడాలంటే వీటిని ఫాలో అవుతారో లేదో చూడాలి.