BigTV English

Fact About Dead Sea: డేడ్ సీ.. ఈ సముద్రంలో అస్సలు మునగరు.. ఎందుకంటే!

Fact About Dead Sea: డేడ్ సీ.. ఈ సముద్రంలో అస్సలు మునగరు.. ఎందుకంటే!

Interesting Facts About Dead Sea: సాధారణంగా నీటిలో పడితే ఎవరైనా మునిగిపోతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈత వచ్చిన వారైతే నీటిపై తేలగలరు. అయితే ఇక్కడ ఈత రాకపోయిన నీటిపై తేలుతారంట. ఇది మీకు ఆశ్యర్యాన్ని కలిగించిన ఇదే నిజం. అలా అని అదేమి స్విమ్మింగ్ పూల్ కాదు. కుంట కూడా కాదు.. సముద్రం. ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడ ఉంది? దాని విశేషాలు తెలుసుకుందాం.


మనం చెప్పుకునే సముద్రం పేరు డెడ్ సీ. ఇది ఇజ్రాయెల్-జోర్డాన్ మధ్య ప్రాంతంలో ఉంది. సముద్రం అనగానే.. పెద్దపెద్ద అలలు, రకరకాల చేపలు, తాబేళ్లు ఇంకా మరెన్నో గుర్తొచ్చుంటాయి. కానీ ఈ డెడ్ సీ‌లో అటువంటివి ఏమి ఉండవు. ఈ సముద్రపు నీటిలో నడవచ్చు, కూర్చోవచ్చు, పేపర్ చదవొచ్చు. సముద్రం మధ్యలోకి వెళ్లినా నీటిలో మునగరు. ప్రపంచంలోనే ఈ సముద్రం ఎంతో ప్రత్యేకమైనది. దీన్ని మృత సముద్రమని కూడా పిలుస్తారు.

సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. కానీ డెడ్ సీ లో మాత్రం సాధారణ సముద్రపు నీటికంటే 10 రెట్లు ఎక్కువగా ఉప్పగా ఉంటుంది. ఈ సముద్రంలో ఎటువంటి జీవరాశులు బ్రతకలేవు. ఇది సుముద్ర మట్టానికి 1,142 అడుగుల దిగువన ఉంది. 306 మీటర్లు లోతులో ఉంటుంది. సముద్రంలోని నీటి ప్రవాహం దిగువ నుంచి పైకి ఉంటుంది. డెడ్ సీ నీటి సాంద్రత 1.240 Kg/Lగా ఉంది. దీని కారణంగానే నీటిపై తేలియాడుతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైనది.


ఈ డెడ్ సీ సముద్రపు నీటిలో బ్రోమైడ్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియంతో పాటు సల్ఫర్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా నీటి అంచున రాళ్లు, ఇసుక మెరుస్తుంది. నీరు ఎక్కువగా ఉప్పగా మారడానికి ఇదే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెడ్ సీలో స్నానం చేయడానికి ముందుగా అక్కడున్న సీ మడ్ మాస్క్‌తో కప్పుకుంటారు. దీంతో వారి శరీరం ఆ బంకమట్టిలో ఉన్న హైలురోనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను గ్రహిస్తాయి. దీన్ని సాల్ట్ సీ, సీ ఆఫ్ లాట్ అని కూడా అంటారు.

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×