BigTV English

Yatra 2 Twitter Review : యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ

Yatra 2 Twitter Review : యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ

Yatra 2 Movie Twitter Review(Movie reviews in telugu): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్ర.. చిత్రానికి సీక్వెల్ గా తీసిన సినిమా యాత్ర 2. వైఎస్సార్ తర్వాత.. ఆయన తనయుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఏపీ సీఎం క్యారెక్టర్ లో జీవా నటించారు. మరి ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం పై.. ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.


యాత్ర 2 సినిమాకు Xలో పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమా రాజకీయాలకు సంబంధించింది కాదని.. తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అని డైరెక్టర్ ముందు నుంచి చెబుతున్నట్లే సినిమా ఉందని నెటిజన్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ వచ్చిన బయోపిక్ లలో ఇది ది బెస్ట్ అని, సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని ట్వీట్స్ చేశారు.

సినిమాలో ప్రతి డైలాగ్ బాగుందని, ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ కు విజిల్స్ పడతాయని అంటున్నారు. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే అవుతుంది.. పులిని తీసుకొచ్చి బోనులో పెట్టినా అది పులే అవుతుందన్న డైలాగ్ సినిమాకే హైలెట్ అంటున్నారు. జీవా, మమ్ముట్టి తమ పాత్రలకు ప్రాణం పోశారని అభినందిస్తున్నారు.

కొందరు నెటిజన్లు మాత్రం.. ఈ సినిమా పూర్తిగా వన్ సైడ్ ఉందని, అసలేం జరిగిందన్నది ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తేనే బయోపిక్ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “పేదోళ్ల పార్టీ అండతో & పేదోళ్ల ఫండింగ్ తో తీసిన ఫేక్ ప్రాపగాండా చిత్రం #Yatra2 ను… పాపం పేదవాళ్ళు చూడాలనే మహోన్నతమైన ఆశయంతో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్లను ₹177 & ₹295 గా నిర్ణయించింది. ఏపీలో పేదవాళ్ళు ఇంత RICH గా ఉంటారా అని మాత్రం అడగొద్ధు” అని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

https://twitter.com/SriKanthY_/status/1755417537905320060?s=20

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×