Anger: కోపం అనేది ఒక సాధారణ మానసిక భావోద్వేగం. కానీ.. అది అదుపు తప్పినప్పుడు మన శారీరక, మానసిక ఆరోగ్యంప.. అలాగే మన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కోపం వచ్చినప్పుడు దానిని సరిగ్గా నిర్వహించకపోతే.. అది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది. కోపాన్ని శాశ్వతంగా వదిలించుకోలేం. కానీ దానిని నియంత్రించడం నేర్చుకోవచ్చు.
1. కొన్ని క్షణాలు ఆగి ఆలోచించండి:
కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా.. కొన్ని క్షణాలు ఆగి ఆలోచించడం చాలా ముఖ్యం. వెంటనే మాట్లాడటం లేదా చర్య తీసుకోవడం వల్ల తర్వాత పశ్చాత్తాపపడే అవకాశాలు ఉంటాయి. ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడటం మంచిది.
2. లోతైన శ్వాస తీసుకోండి:
కోపం వచ్చినప్పుడు శ్వాస వేగంగా మారుతుంది. ఆ సమయంలో.. నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం వల్ల మనసు శాంతపడుతుంది. ఊపిరితిత్తులలోకి గాలిని నింపి, నెమ్మదిగా బయటకు వదలడం వల్ల గుండె వేగం తగ్గుతుంది. అంతే కాకుండా కూడా ఒత్తిడి తగ్గుతుంది.
3. సమస్య నుంచి దృష్టి మళ్లించండి:
కోపం తెప్పించిన పరిస్థితి నుంచి దృష్టిని మళ్లించడం వల్ల ఆవేశం తగ్గుతుంది. ఆ సమయంలో ఒక గ్లాసు నీళ్లు తాగడం.. బయటకు వెళ్లి కాసేపు నడవడం, మీకు ఇష్టమైన పాటలు వినడం లేదా మీకు ఇష్టమైన పనిని చేయడం వల్ల మీ ఆలోచనలు మారతాయి.
4. సమస్యను పరిష్కరించడం నేర్చుకోండి:
కోపానికి మూల కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కోపం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటే.. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించవచ్చు. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెడితే కోపం తగ్గుతుంది.
5. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:
శారీరక శ్రమ కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించి.. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
Also Read: ముఖంపై ట్యాన్.. తొలగిపోవాలంటే ?
6. మీ భావాలను వ్యక్తపరచడం నేర్చుకోండి:
కోపాన్ని అణచిపెట్టుకోవడం వల్ల అది మరింత తీవ్రమవుతుంది. మీకు కోపం ఎందుకు వచ్చిందో ఇతరులకు ప్రశాంతంగా చెప్పడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
7. నిద్ర, ఆహారంపై శ్రద్ధ పెట్టండి:
తగినంత నిద్ర లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం కూడా కోపానికి కారణం కావచ్చు. కనీసం 7-8 గంటల నిద్ర, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఈ చిట్కాలు పాటించినా కోపాన్ని నియంత్రించుకోలేకపోతే.. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడం ఒక ప్రక్రియ, దానికి సమయం పడుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.