హోలీకి రంగులు వేసుకునేందుకు సిద్ధపడుతున్నారా? అయితే మీ చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలను ముందే పాటించాలి. రంగుల పండుగ హోలీ. ఆ రోజు ఇల్లు, వీధి, ఊరు అంతా ఆనందంతో నిండిపోతుంది. అంతా ఏకమై రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా ఉంటారు.
ఆ హోలీ రంగులు అధికంగా రసాయనాలు కలిపినవే. ఆర్గానిక్ రంగులు వాడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఈ హోలీ రంగులు చర్మంపై పడితే ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. ఈ రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి.
హోలీ రంగులతో మొటిమలు
ముఖం మీద పడిన హోలీ రంగులు మొటిమలు రావడానికి కారణం అవుతాయి. రంగులు పడగానే దురదగా అనిపిస్తున్నా, చికాకు వేస్తున్నా, ఎరుపు రంగులోకి చర్మం మారినా అవి మీకు పడటం లేదని అర్థం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ముఖాన్ని కాపాడుకోవాలి. దాని కోసం ముందుగానే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కొబ్బరి నూనెతో
హోలీ ఆడటానికి ముందే ముఖానికి కొబ్బరి నూనె రాసుకోండి. కొబ్బరి నూనె కాకపోతే కలబంద జెల్, ఆలివ్ నూనె కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనె చర్మంపై రంగులు పడకుండా కాపాడుతుంది. ముఖాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. నూనె రాయడం వల్ల రంగులు సులభంగా తొలగిపోతాయి. ఎందుకంటే చర్మం వరకు రంగులను చేరనివ్వదు. ఈ నూనె కాబట్టి చర్మాన్ని దెబ్బ తినకుండా ఇది కాపాడుతుంది.
హోలీ రంగులు వేసుకున్నాక చర్మాన్ని పరిశుభ్రంగా కడగడం అవసరం. అలా కడిగేందుకు కూడా రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ను వాడితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మైల్డ్ ఫేస్ వాష్ ను లేదా శెనగపిండి వంటి వాటితో మసాజ్ చేసి రంగుల్ని వదిలించుకోవడం మంచిది. లేకుంటే చర్మంపై చికాకు, మంట ఎక్కువైపోతాయి. దద్దుర్లు, మొటిమలు ఒక్కరోజులోనే మొదలైపోతాయి.
రోజ వాటర్‌తో లా
ముఖాన్ని చల్లబరిచేందుకు రోజ్ వాటర్ ను ఎక్కువగా వినియోగిస్తారు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. హోలీ తర్వాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం తేమగా ఉండి… మొటిమలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రోజ్ వాటర్ చర్మానికి విశ్రాంతినిస్తుంది. దీనివల్ల చర్మంపై చికాకు, ఎరుపు, దద్దుర్లు వంటివి రాకుండా ఉంటాయి.
హోలీలో ఆడిన రంగులు ముఖంపై పడితే మొటిమలు ఏర్పడవచ్చు. కాబట్టి వెంటనే వేప ఆకుల పేస్టును పూస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. మొటిమలను తగ్గిస్తాయి.
Also Read: కలర్ ఫుల్ హోలీ శుభాకాంక్షలు.. మీ ప్రియమైన వారికి ఇలా చెప్పండి..
హోలీ ఆడటానికి ముందు, ఆడిన తర్వాత కూడా చర్మ సంరక్షణ కోసం కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడడం మర్చిపోవద్దు. రంగులు, నీరు కలిసి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. చర్మం తేమవంతంగా లేకపోతే నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి మంచి మాయిశ్చరైజర్ని చర్మానికి రాసుకోవడం వల్ల అది హైడ్రేటెడ్ గా ఉంటుంది.