E-Paper
Advertisement

Acne: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?

Acne: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?
Advertisement

Acne: చాక్లెట్లు పేరు చెబితేనే ఏ వయసు వారికైనా నోరూరిపోతుంది. ప్రతిరోజూ కనీసం రెండు మూడు చాక్లెట్లు తినేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే చాక్లెట్లు తినే వారిలో మొటిమలు వచ్చే అవకాశం ఉందని జనాల్లో ఒక వాదన ఉంది. అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. తొలిసారి 1960లోనే చాక్లెట్లకు మొటిమలకు ఉన్న అనుబంధాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. అయితే ఆ అధ్యయనంలో చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయన్న వాదనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత నుంచి కూడా ఎన్నో అధ్యయనాలు.. చాక్లెట్లు మొటిమలకు ఉండే అనుబంధాన్ని తెలుసుకోవడం కోసం జరుగుతూనే ఉన్నాయి.

ఈమధ్య చేసిన అధ్యయనాల్లో మొటిమలు రావడానికి చాక్లెట్లు కూడా ఒక కారణం కావచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే చాక్లెట్లలో కొవ్వులు, పాల ఉత్పత్తులు, చక్కెర శాతం అధికంగా ఉంటాయి. వీటివల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కొవ్వులు పాల ఉత్పత్తులు చక్కెరలు కలిపి ఉన్న పదార్థాలు పాశ్చాత్య డైట్ లో భాగంగా ఉంటాయి. కాబట్టి చర్మం పై ఉన్న చర్మ గ్రంధులు ఈ ఆయిల్ కొవ్వులు వల్ల మూసుకుపోతాయి. దీనివల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

Advertisement

మొటిమలు రావడానికి కేవలం వయసే కారణం కాదు, చర్మశుభ్రత లేకపోయినా కూడా మొటిమలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఎవరికైతే అతిగా జిడ్డు పడుతుందో చర్మంపై నూనె ఉత్పత్తి పెరిగిపోయి వారికి మొటిమలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి చాక్లెట్లను అధికంగా తినడం మానేయడమే ఉత్తమం. వాటిని అధికంగా తింటే మొటిమల సమస్య ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది.

Also Read: చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?

Advertisement

కేవలం చాక్లెట్లు వంటివి తినడం వల్లే మొటిమలు వస్తాయని చెప్పలేం, ఒత్తిడి వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల అలాగే పీఎమఎస్ వంటి సమస్యల వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. మొటిమలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. పండ్లు, ఆకుకూరలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ద్రవాహారాన్ని అధికంగా తీసుకోవాలి. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసులు నీటిని తాగుతూ ఉండాలి. అలాగే ముఖంపై జిడ్డు పట్టగానే శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైతే ముఖంపై జిడ్డు అధికంగా ఉత్పత్తి అవుతుందో, అప్పుడు చర్మ గ్రంధులు మూసుకుపోయి మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. కాబట్టి సమతులాహారాన్ని, పరిశుభ్రతను పాటించడం ద్వారా మొటిమలు రాకుండా అడ్డుకోవచ్చు.

డార్క్ చాక్లెట్ ను మాత్రం ప్రతిరోజూ చిన్న ముక్క తినడం వల్ల మాత్రం కొన్నిరకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ చాక్లెట్ ముక్క మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీలో ఒత్తిడి తగ్గించేందుకు చాక్లెట్ ముక్కను తింటూ ఉంటే మంచిది. సాధారణ చాక్లెట్ కు, డార్క్ చాక్లెట్ కు మధ్య చాలా తేడా ఉంది. డార్క్ చాక్లెట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అందుకే ఇది తీయగా కాకుండా, కాస్త చేదుగా ఉంటుంది. అయినా కూడా ప్రతి రోజూ చిన్న ముక్కను తినడం అలవాటు చేసుకోవాలి.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×