BigTV English

Jumping castle: మీ పిల్లలను ఇవి ఎక్కిస్తున్నారా? ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో తెలుసుకోవల్సిందే!

Jumping castle: మీ పిల్లలను ఇవి ఎక్కిస్తున్నారా? ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో తెలుసుకోవల్సిందే!

కిడ్స్ జోన్ వంటి అనేక ప్రాంతాల్లో పిల్లల ఆట వస్తువులు అధికంగా ఉంటాయి. వారు గెంతేందుకు, జారేందుకు అనేక రకాల గాలితో నింపిన ఆటవస్తువులను అక్కడ ఉంచుతారు. అయితే ఈ పరికరాలు ఏర్పాటు చేసేటప్పుడు భద్రతా చట్టాలు సరిగ్గా పాటించకపోతే అది పిల్లల ప్రాణానికే ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆరుగును పిల్లల ప్రాణాలను తీసింది.


2021లో ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో పిల్లల ఆట స్థలంలో బౌన్సీ క్యాజిల్ ఏర్పాటు చేశారు. అంటే పిల్లలు దానిపై ఎక్కి గెంతవచ్చు, జారవచ్చు. ఇలాంటివి వాటిని పిల్లలు బాగా ఇష్టపడతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా అలాంటి వస్తువులు ఉన్న స్కూల్లో లేదా ఆట ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ఇష్టపడతారు. అయితే టాస్మానియాలోని స్కూల్లో కేవలం ఆ బౌన్సీ క్యాజిల్ కారణంగానే ఆరుగురు పిల్లలు మరణించారు. ఇప్పటికీ ఆ సంఘటనను ఆ ప్రాంతంలోని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు.

ఏం జరిగింది?
స్కూల్లోని బౌన్సీ క్యాజిల్ పై ఆడుకుంటుండుగా ఆరుగురు పిల్లలు మరణించడం మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటం జరిగింది. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో విపరీతంగా గాలి వీచడంతో ఆ జంపింగ్ క్యాజెల్ గాలిలోకి ఎగిరిపోయింది. ఆ సమయంలో జంపింగ్ క్యాజిల్ లోపల ఏడుగురు పిల్లలు ఉన్నారు. దాదాపు 33 అడుగుల ఎత్తుకు ఆ క్యాజిల్ ఎగిరిపోయింది. అంత ఎత్తు నుంచి పిల్లలు కిందపడిపోయారు. ఆ ఏడుగురు పిల్లల్లో ఐదుగురికి తీవ్రమైన గాయాలు తగిలి మరణించారు. మరొక పిల్లవాడికి పై ఆ జంపింగ్ క్యాజిల్ పడిపోయింది. దీంతో ఆ పిల్లవాడు కూడా మరణించాడు.


ఇలాంటి గాలితో నింపిన ఆట వస్తువులను స్థిరంగా నేలకు గట్టిగా అతుక్కునేలా ఏర్పాటు చేయాలి. అవి సరిగా ఏర్పాటు కాకపోతే తీవ్రమైన గాలికి అవి ఎగిరిపోయే అవకాశం ఉంది. అలా ఎగిరిపోవడం వల్లే పది మీటర్ల ఎత్తు నుండి పిల్లలు కింద పడిపోయి మరణించడం జరిగింది. కాబట్టి ఓపెన్ ప్రదేశాలలో బాగా గాలి వీచే చోట ఇలాంటి ఆట వస్తువులు ఉంటే పిల్లలను వాటికి దూరంగా ఉంచడమే మంచిది. ఎక్కువగా గాలి వీచే చోట ఈ జంపింగ్ క్యాజెల్ వంటి నిర్మాణాలు ఉంటే పిల్లలను ఆడించవద్దు. ఎందుకంటే అక్కడ అధిక స్థాయిలో తీవ్రంగా గాలివీచే అవకాశం ఉంటుంది.

చనిపోయిన పిల్లల వయసు 11 ఏళ్ళు నుంచి 12 ఏళ్ళ మధ్య మాత్రమే. ఈ సంఘటనతో ఆస్ట్రేలియాలో కొన్నిచోట్ల గాలితో నిండిన ఆట వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.

పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అలా అని వారి భద్రత గాలికి వదిలేయడం మాత్రం మంచిది కాదు. పిల్లలు ప్రమాదాన్ని ముందుగా ఊహించలేరు. కాబట్టి తల్లిదండ్రులే వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి గాలితో నిండిన వస్తువులు ప్రమాదకరంగా అనిపిస్తే అక్కడికి పిల్లల్ని తీసుకెళ్లకూడదు.

టాస్మానియాలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదకరమైన సంఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. 12 ఏళ్ల పాటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్ళముందే అంత ఎత్తు నుండి గాలిలో కిందకి పడడం చూడలేకపోయారు. ఆ సంఘటన తర్వాత ఎంతోమంది మానసిక వేదనకు గురయ్యారు. ఇప్పటికీ వారు మానసికపరమైన సమస్యలతోనే అల్లాడుతున్నారు.

కేవలం వారి తల్లిదండ్రులే కాదు పిల్లల్ని కాపాడేందుకు వచ్చిన అత్యవసర సిబ్బంది కూడా ఆ పిల్లలని చూసి అల్లాడిపోయారు. వారు కూడా మానసికంగా కలత చెంది ఉద్యోగాలు సెలవు పెట్టి ఇప్పటికీ తగిన చికిత్సను తీసుకుంటున్నారు. అప్పటివరకు నవ్వుతూ తుళ్లుతూ ఉన్న పిల్లలు 33 అడుగుల నుండి కింద పడిపోవడం, దాన్ని కళ్ళారా చూడడం, ఆ సంఘటన మర్చిపోవడం అనేది అంత సులువు కాదు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×