Monsoon Hair Care: వాన చినుకులు హృదయానికి ప్రశాంతతను కలిగిస్తాయి. కానీ ఈ సీజన్‌లో జుట్టుకు అనేక సమస్యలు వస్తాయి. గాలిలో తేమ పెరగడం వల్ల.. జుట్టు జిగటగా మారుతుంది. అంతే కాకుండా తలపై చర్మం జిగటగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సీజన్ లో చాలా మంది ఎదుర్కునే అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. తలస్నానం చేసిన ప్రతిసారీ.. జుట్టు ఎక్కువగా రాలే సమస్యను ఎదుర్కుంటారు. ఇది మనస్సుకు ఆందోళన కలిగిస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు.
ఈ సీజన్‌లో సరైన జాగ్రత్తలు , కొన్ని హోం రెమెడీస్ పాటిస్తే.. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు మందంగా, బలంగా కూడా మారుతుంది.
ఉసిరి, నిమ్మ నూనె:
ఉసిరి జుట్టుకు ఒక సూపర్ ఫుడ్. నిమ్మరసం తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రెండింటినీ కలిపి తయారు చేసిన నూనె జుట్టు మూలాలకు పోషణనిచ్చి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టును మృదువుగా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఈ హోం రెమెడీ కోసం కాస్త కొబ్బరి నూనెలో 2 టీస్పూన్ల ఉసిరి పొడి వేసి మరిగించాలి. నూనె చల్లబడిన తర్వాత.. దానికి 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఈ నూనెతో తలకు తేలికగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం షాంపూతో వాష్ చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరా మసాజ్:
వర్షాకాలంలో తలపై చర్మం చుండ్రు, చికాకుకు నిలయంగా మారుతుంది. కలబంద తల చర్మానికి ఉప శమనం అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును తేమగా చేస్తుంది.
ఎలా వాడాలి ?
తాజా కలబంద జెల్ తీసుకోండి. తర్వాత మీ వేళ్లతో తలపై చర్మాన్ని బాగా మసాజ్ చేయండి. 30 నుండి 40 నిమిషాలు అలాగే ఉంచి.. తర్వాత కడిగేయండి. వారానికి రెండు సార్లు దీనిని వాడండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.
పెరుగు హెయిర్ ప్యాక్:
పెరుగు జుట్టుకు సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టును మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా ఇది సహజమైన మెరుపును అందిస్తుంది.
Also Read: ఇంట్లోనే నేచురల్ స్క్రబ్ తయారు చేసుకుని వాడితే.. అందం రెట్టింపు
ఎలా వాడాలి ?
2 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఈ ప్యాక్ ను జుట్టుపై అప్లై చేయండి. తర్వాత 30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఈ హోం రెమెడీ జుట్టుకు అవసరం అయిన పోషకాలను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు నివారిస్తుంది.
వర్షంలో జుట్టు సంరక్షణ కష్టమైన పని కాదు, మీకు కొంచెం అవగాహన , క్రమబద్ధత అవసరం. ఈ హోం రెమెడీస్ పాటించడం ద్వారా, మీరు జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా.. వాటిని లోపల నుండి బలంగా, బయట నుండి అందంగా కూడా మార్చుకోవచ్చు.