BigTV English

UTI symptoms: మీ పిల్లలు పెద్దయ్యాక కూడా పక్కపై చుచ్చు పోస్తున్నారా? అయితే ఈ యూటీఐ లక్షణాలు ఉన్నాయేమో చూడండి

UTI symptoms: మీ పిల్లలు పెద్దయ్యాక కూడా పక్కపై చుచ్చు పోస్తున్నారా? అయితే ఈ యూటీఐ లక్షణాలు ఉన్నాయేమో చూడండి

ఐదేళ్ల లోపు పిల్లలు పక్క తడపడం సహజం. ఐదేళ్లు దాటాక కూడా పిల్లలు పక్కతడుపుతూ ఉంటే వారిలో ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది మూత్రనాళంలో వచ్చే ఒక ఇన్ఫెక్షన్ ఇది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలు, బాలికలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.


నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు జీర్ణాశయం నుండి మూత్రనాళంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మలమూత్ర విసర్జన తర్వాత ప్రైవేట్ భాగాలను పరిశుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల కూడా యూటీఐ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక శిశువుల విషయంలో బ్యాక్టీరియాని కలిగి ఉన్న కణాలు ప్రవేశించి ఇలా ఇన్ఫెక్షన్కు కారణం అవుతాయి.

పిల్లల్లో యూటీఐ లక్షణాలు
మూత్ర విసర్జన సమయంలో విపరీతంగా ఏడుస్తూ ఉన్నా, మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోయినా, మంచంపై మూత్ర విసర్జన చేస్తూ ఉన్నా… వారికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందేమో గుర్తించాలి. అలాగే స్పష్టమైన కారణం లేకుండా జ్వరం అధికంగా వస్తూ పోతుండడం, మూత్రం రంగు ముదురు రంగులోకి మారడ, మూత్రం విపరీతంగా దుర్వాసన వేయడం, పొట్ట దిగువునా నొప్పి ఎక్కువగా రావడం, వాంతులు అధికంగా కావడం వంటివి కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లక్షణాలగానే భావించాలి.


పిల్లల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. వారిచేత ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేయిస్తూ ఉండాలి. ఇలా అయితే మూత్ర నాళంలో బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే పిల్లల ప్రైవేట్ పార్ట్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మలవిసర్జన తర్వాత పరిశుభ్రంగా కడగాలి. పిల్లలకు బిగుతుగా ఉండే లోదుస్తులు వేయకూడదు. దీనివల్ల గాలి సరిగ్గా తగలక అక్కడ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు తగిన మోతాదులో నీటిని తాగడం చాలా ముఖ్యం. కాబట్టి మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుండి పిల్లలను రక్షించేందుకు తగినంత ద్రవాలను పిల్లలకు ఇవ్వాలి. అలాగే సమతుల ఆహారాన్ని ఇవ్వాలి. జంక్ ఫుడ్ ను పూర్తిగా తగ్గించాలి.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడే పిల్లలకు పెరుగుతో ఆహారాన్ని అధికంగా పెట్టాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. ఈ మంచి బ్యాక్టీరియా మూత్రనాళంలో చెడు బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా తగ్గుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Also Read: తిన్న తర్వాత మీ పొట్ట బెలూన్‌లాగా ఉబ్బుతోందా? ఈ ఇంటి చిట్కాలను పాటించండి

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ లక్షణాలను కూడా తగ్గించేందుకు సహాయపడతాయి. కాబట్టి ఆహారంలో పచ్చి లేదా వండిన వెల్లుల్లి అధికంగా వేసి తినిపిస్తూ ఉండండి.

కీరా దోసకాయ
కీరా దోసకాయ యూరినరీ ఇన్ఫెక్షన్లు నివారించడంలో సహాయపడుతుంది. దీనిలో సమృద్ధిగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మూత్రనాళాలను శుభ్రంగా ఉంచి బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×