BigTV English

Stomach Problems: తిన్న తర్వాత మీ పొట్ట బెలూన్‌లాగా ఉబ్బుతోందా? ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Stomach Problems: తిన్న తర్వాత మీ పొట్ట బెలూన్‌లాగా ఉబ్బుతోందా? ఈ ఇంటి చిట్కాలను పాటించండి

పొట్ట నిండా ఇష్టమైన ఆహారం తిన్న తర్వాత కొంతమందిలో సమస్య మొదలవుతుంది. వారి పొట్ట బెలూన్ లాగా ఉబ్బినట్టు అవుతుంది. తేనుపులు, గ్యాస్ వంటివి వస్తూనే ఉంటాయి. అతిగా తినడం లేదా తిన్నప్పుడు గాలిని మింగేయడం వల్ల పొట్టలో అతిగా గాలి చేరిపోతుంది. అలాగే హడావుడిగా, వేగంగా తినడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. కొన్ని రకాల ఆహారాలు కూడా గ్యాస్ ఉత్పత్తిని పెంచేస్తాయి. ముఖ్యంగా క్యాబేజీలు, బీన్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు గ్యాస్ ఉత్పత్తిని అధికం చేస్తాయి. ఇలాంటి వారిలో జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యను అలాగే వదిలేస్తే అవి తీవ్ర జీర్ణవ్యవస్థ సమస్యలుగా మారిపోతాయి. కాబట్టి తిన్న వెంటనే మీకు పొట్ట ఇబ్బందిగా అనిపిస్తున్నా, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నా కొన్ని ఇంటి చిట్కాలను పాటించండి. ఇవి ఏమీ పొట్టను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.


పొట్ట ఉబ్బరం అనేది ఒక సాధారణ సమస్య. అతిగా తినడము, గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారం తినడం వల్ల ఇది వస్తుంది. అలాగే ఆరోగ్యకరంగా తినకపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏదో వేగంగా తినేసి వెళ్లిపోవాలనుకుంటారు. అలాంటి వారికి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

గ్యాస్ట్రిక్ సమస్యలు, త్రేన్పులు వంటివి ఎక్కువగా రాకూడదనుకుంటే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. గాబరా గాబరాగా తినకూడదు. అలా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి చేరిపోతుంది. నీటిని తాగేటప్పుడు కూడా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. నీరు కన్నా గాలి అధికంగా మింగేస్తే పొట్టలో సమస్యలు మొదలవుతాయి. కాబట్టి తినడం, తాగడం అనేవి ఎంత ప్రశాంతంగా చేస్తే అంత మంచిది.


కొందరిలో కడుపుబ్బరం సమస్య అధికంగా ఉంటుంది. అలాంటివారు కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. గ్యాస్ ను, ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే పదార్థాలను తినడం మానేస్తే వారి పొట్ట ప్రశాంతంగా ఉంటుంది. కడుపుబ్బరం సమస్యలతో బాధపడేవారు అధికంగా బంగాళదుంపలు, మొక్కజొన్నలు, నూడుల్స్, గోధుమలతో చేసిన పదార్థాలను తక్కువగా తింటే మంచిది. ఎందుకంటే పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణ వ్యవస్థలో గ్యాస్ ను అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే బీన్స్ ,పుట్టగొడుగులు, కూల్ డ్రింకులు వంటివి కూడా తక్కువగా తింటే మంచిది. వీటిని తినేటప్పుడు చాలా నెమ్మదిగా తినాలి. పాలు కూడా అతిగా తాగకూడదు. ఇవన్నీ కూడా మీలో గ్యాస్ ఉత్పత్తిని పెంచేస్తాయి. కొంత మందిలో లాక్టోజ్ అసహనం సమస్య ఉంటుంది. అంటే పాలల్లో ఉన్న సమ్మేళనాలలో పేగులు అరిగించుకోలేవు. అలాంటి వారిలో కూడా గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవకాశం ఉంది. కాబట్టి పాల ఉత్పత్తులను తక్కువగా తినండి.

అధికంగా ప్రక్టోజ్ ఉండే యాపిల్స్, నేరేడు పండ్లు, రేగుపండ్లు వంటివి కూడా తక్కువగా తింటే మంచిది. పండ్ల రసాలను తాగే బదులు పండ్లను తినేందుకు ప్రయత్నించండి. అరటిపండ్లు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో ఫ్రక్టోస్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి పండ్లను మీరు తినవచ్చు. అలాగే క్రూసిఫెరస్ జాతికి చెందిన కూరగాయలైన బ్రకోలి, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి కూడా గ్యాస్ ను అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మీకు గ్యాస్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఫైబర్ పేగు కదలికలను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే గింజలు, నట్స్, క్యారెట్లు, బెండకాయలు, తృణధాన్యాలు, పాలకూర వంటివి తినేందుకు ప్రయత్నించండి.

పొట్టలో మంచి బ్యాక్టీరియా తగ్గినా కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రోబయోటిక్స్ ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పెరుగును అధికంగా తీసుకోవాలి. భోజనంలో చివర పెరుగన్నం తినేలా ప్లాన్ చేసుకోండి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, గట్ బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

రోజువారీ వ్యాయామం చేయడం మాత్రం మర్చిపోవద్దు. వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్ట ఉబ్బరం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి రోజువారీ వ్యాయామం కనీసం అరగంట పాటు చేసేందుకు ప్రయత్నించండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×