Cancer: గత కొన్ని దశాబ్దాలుగా.. ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధుల వెనుక ఉన్న ప్రధాన కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. అంతే కాకుండా ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రావడానికి కూడా కారణం అవుతున్నాయి.
ఇటీవల జరిగిన ఓ పరిశోధన ప్రకారం బ్రెస్ట్, పెద్ద పేగు క్యాన్సర్ కు సంబంధించిన ఓ పరిశోధనలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు అధికంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట.
ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధనలో 5,40,000 కంటే ఎక్కువ మంది మహిళలు హాజరయ్యారు. శాస్త్రవేత్తలు వీరు తినే ఆహారంతో పాటు వీరి ఆరోగ్యంపై కలిగే ప్రభావాలను అధ్యయనం చేశారు. సాస్ లు, బేక్ చేసిన ఆహారాలతో పాటు ప్రాసెస్ చేసిన పదార్థాల మాంసాహారం తినే వారిలో బ్రెస్ట్, పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల ఎక్కువగా ఉంటుందని రుజువైంది. అంతే కాకుండా ఈ ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉంటుందట.
ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది ?
ప్రాసెస్ చేసిన మాంసంలో ఉండే నైట్రేట్ల వంటి రసాయనాలు క్యాన్సర్ కారకమని పరిశోధకులు కనుగొన్నారు. ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాలను దెబ్బతీస్తాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇవే కాకుండా.. ప్రాసెస్ చేసిన మాంసంలో అధిక మొత్తంలో ఉప్పు , నిల్వ చేయడానికి ఉపయోగించే.. ఇతర పదార్థాలు ఉంటాయి. ఇవి శరీర జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ పదార్థాలు ప్రేగులలో వాపును కలిగిస్తాయి. అంతే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని ఇవి బలహీనపరుస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్రాసెస్ చేసిన మాంసం తినడం తగ్గిస్తే.. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బదులుగా.. మన ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సహజ ప్రోటీన్లు పప్పు ధాన్యాలు, గింజలు, తాజా మాంసం వంటివి చేర్చుకోవాలి. అంతే కాకుండా పోషకాలు సరిపడా తీసుకున్నప్పుడు మాత్రమే శరీరం వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది.
Also Read: అలోవెరా ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
ఆరోగ్యకరమైన , సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర తీవ్రమైన వ్యాధులను కూడా నివారించవచ్చని వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా , బలంగా ఉంచుకోవడానికి ప్రాసెస్ చేసిన , జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం పూర్తిగా మానుకోండి. అంతే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. అంతే కాకుండా బరువు అదుపులో ఉండటానికి కూడా వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది.