NIIT Professor Arrest Female Student Abuse| విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన కొందరు అధ్యాపకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ బాగోతం బయట పడిన కొన్ని రోజులకే.. అస్సాంలోని సిల్చార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదే తరహా వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది. అస్సాం రాష్ట్రంలోని సిల్చార్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నీట్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వర రాజు ధేనుకొండ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు డాక్టర్ కోటేశ్వర రాజును అరెస్ట్ చేశారు. దీంతో నీట్ యాజమాన్యం అతడిని కాలేజీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహత్తా తెలిపారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో పోలీసులు అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) చదువుకునే విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు రాత్రంతా నిరసన తెలిపారు.
Also Read: మత్తుమందిచ్చి మహిళలతో ఆ పని చేసే దొంగబాబా.. యువతుల లోదుస్తులు దోచుకునే టెకీ
బాధితురాలి పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఆమెను ప్రొఫెసర్ తన చాంబర్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇంతకుముందు కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఇన్‌స్టిట్యూట్ అధికారులకు రాసిన లిఖితపూర్వక ఫిర్యాదులో.. ప్రొఫెసర్ తనకు వచ్చిన తక్కువ గ్రేడ్‌ల గురించి చర్చించేందుకు చాంబర్‌కు పిలిచారని, ఆ తరువాత తనను అనుచితంగా తాకాడని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు గురించి తెలియగానే నిందితుడు దాక్కునేందుకు ప్రయత్నించాడని పోలీసు అధికారి తెలిపారు. అయితే నిందితుడి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ తర్వాత నిందితుడిని భారత శిక్షాస్మృతి (ఐపీసి) లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
పెన్ కెమెరాలో వీడియోలు రికార్డ్ చేసిన ప్రోఫెసర్
హత్రాస్ లో కూడా ఇలాగే పాఠాలు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులతో లైంగిక వాంఛ తీర్చుకుని ఆ దృశ్యాలను వీడియోల్లో రికార్డ్ చేశాడు. వాటిని చూపిస్తూ విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ తన కామ వాంఛను తీర్చుకునేవాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. 72 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు.
ప్రయాగ్ రాజ్ లోని హత్రాస్ జిల్లా సేత్ పుల్ చంద్ బాగ్లా కాలేజీలో జాగ్రఫీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 50 ఏళ్ల రాజ్ నీష్ కుమార్, కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరీక్షల్లో మార్కులు అధికంగా వేస్తానని మాయ మాటలు చెప్పి స్టూడెంట్స్‌ను లోబర్చుకున్నాడు. అలా వారిపై లైంగిక దాడి జరిపి ఆ దృశ్యాలను పెన్ కెమెరా ద్వారా రికార్డు చేశాడు. మళ్లీ ఆ వీడియోలు సదరు స్టూడెంట్స్‌కు చూపించి వారిని లోబరచుకుని పదేపదే వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.