BigTV English

Arteries Block Ayurvedic Remedies: గుండె ధమనుల్లో పూడికలు ప్రాణాంతకం.. ఆయుర్వేద టిప్స్‌తో ఇలా క్లీన్ చేసుకోండి

Arteries Block Ayurvedic Remedies: గుండె ధమనుల్లో పూడికలు ప్రాణాంతకం.. ఆయుర్వేద టిప్స్‌తో ఇలా క్లీన్ చేసుకోండి

Arteries Block Ayurvedic Remedies| ఆరోగ్యవంతమైన గుండెకు శుభ్రమైన ధమనులు చాలా ముఖ్యం. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే రక్తం సరఫరా నిలిచిపోయి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. ఆయుర్వేదం.. పురాతన భారతీయ వైద్య పద్ధతి. ఇంట్లోనే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ మార్గాలను ఆయుర్వేదం సూచిస్తుంది. మాధవ్‌బాగ్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ రోహిత్ సనే, ధమనులను ఆరోగ్యంగా ఉంచే 7 ఆయుర్వేద చిట్కాలను పంచుకున్నారు.


జీర్ణశక్తి (అగ్ని) ప్రకారం మితంగా ఆహారం తీసుకోవాలి
మీ జీర్ణశక్తికి తగినట్లు ఆహారం తీసుకుంటే, తీసుకున్న కేలరీలు, కొవ్వులు సరిగ్గా జీర్ణమవుతాయి. సమతుల ఆహారంతో ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించవచ్చు. అవసరం కంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే (ఎక్కువ ఆహారం తింటే), అవి అమా మలినాలుగా మారి ధమనులలో చేరతాయి. మీ శరీరం, జీర్ణశక్తికి తగిన ఆహారం తీసుకోవడం వల్ల అనవసర కొవ్వు ఏర్పడదు, ధమనులు అడ్డుపడవు.

సమతులంగా కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ధమనులకు హాని చేస్తాయి. బంగాళదుంపలు కొన్నిసార్లు సాధారణ చక్కెర కంటే వేగంగా రక్తంలో చక్కెరను పెంచుతాయి. అధిక గ్లూకోజ్ ధమనుల లోపలి భాగాలను దెబ్బతీసి, కొవ్వు పేరుకోవడానికి కారణమవుతుంది. కార్బోహైడ్రేట్లను సమతులంగా తీసుకుంటూ ఆహార ప్రణాళిక వేసుకుంటే, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి, ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి.


ఆయుర్వేద మూలికలతో రక్తపోటును తగ్గించండి
అధిక రక్తపోటు ధమనులలో మార్పులు, కొవ్వు పేరుకోవడానికి దారితీస్తుంది. టీ, కాఫీలను తగ్గించడం మంచిది. అశ్వగంధ, బ్రాహ్మి, జటామాంసి వంటి ఆయుర్వేద మూలికలు శరీరం, మనస్సును సమతులంగా ఉంచుతాయి. ఒత్తిడిని తగ్గించి, రక్తపోటును నియంత్రించి, ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నియమిత పేగు కదలికలతో డిటాక్స్ చేయండి
అదనపు కొవ్వును తొలగించడానికి నియమిత పేగు కదలికలు అవసరం. ఆయుర్వేదంలో విరేచన (మందులతో కడుపు శుభ్రం చేయడం) సిఫారసు చేస్తారు. రోజూ కొన్ని బొప్పాయి గింజలు నమలడం లేదా వారానికి ఒకసారి 20 మి.లీ. ఆముదం తాగడం ద్వారా కడుపు శుభ్రమవుతుంది, ధమనులలో కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
సాగే ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం తక్కువ. వ్యాయామం చేస్తే గుండె సాధారణంగా విస్తరిస్తూ, సంకోచిస్తూ ఉంటుంది, కొవ్వు చేరదు. కార్డియో, వెయిట్ ట్రైనింగ్, స్ట్రెచింగ్, బ్యాలెన్సింగ్, శ్వాస వ్యాయామాలతో కూడిన ఆయుర్వేద వ్యాయామం ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మూలికలు, యోగా, ధ్యానంతో ఒత్తిడిని నియంత్రించండి
పదేపదే ఒత్తిడి శరీర జీవక్రియ, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, ధమనులకు హాని చేస్తుంది. బ్రాహ్మి, జటామాంసి, శంఖపుష్పి వంటి మూలికలు మనసును శాంతపరుస్తాయి. యోగా, ధ్యానం మానసిక సమతుల్యత, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

దినచర్యను అనుసరించండి
రోజువారీ జీవన విధానం (దినచర్య) ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సర్కెడియన్ రిథమ్ (నిద్ర కాలచక్రం) గందరగోళానికి గురైతే రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆయుర్వేదంలో దినచర్య ప్రకారం.. నియమితంగా నిద్ర, ఆహారం, మేల్కొనే సమయాలను పాటిస్తే ధమనులు శుభ్రంగా ఉంటాయి.

Also Read: మహిళల్లోనే థైరాయిడ్ సమస్య ఎక్కువ?.. జాగ్రత్తలు, చికిత్స ఇవే..

ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇంట్లోనే మీ ధమనులను ఆరోగ్యంగా ఉంచి, గుండెను బలోపేతం చేయవచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×