BigTV English

Janhvi Kapoor: జగదేక వీరుడు కోసం అతిలోక సుందరి వచ్చేసింది..

Janhvi Kapoor: జగదేక వీరుడు కోసం అతిలోక సుందరి వచ్చేసింది..

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ స్థానం ఎప్పుడూ తెలుగువారి గుండెల్లో పదిలంగా ఉంటుంది. జాన్వీ తెలుగు ఎంట్రీ ఇవ్వకముందే ఆమెకు టాలీవుడ్ లో. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో మరింత హైప్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ తోనే తెలుగు సినిమా చేయాలని ఆమె రోజు కలలు కనేదట. అంతేనా దేవుడిని కూడా మొక్కుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. దేవుడి ఆశీస్సులతో దేవర సినిమాతో జాన్వీ తెలుగు ఎంట్రీ ఇచ్చింది. తంగంగా అమ్మడు కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె అందానికి ఫ్యాన్స్ ముగ్దులు అయ్యారు. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు వచ్చినా జాన్వీ.. ఆచూతూచి మంచి కథలను ఎంచుకుంటుంది.


 

దేవర తరువాత జాన్వీ నటిస్తున్న చిత్రం పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్  సోషల్ మీడియాను షేక్ చేశాయి.  ఇక రామ్ చరణ్, జాన్వీని జంటగా చూస్తుంటే.. వారి పేరెంట్స్ చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి న్యూ వెర్షన్ లా కనిపిస్తున్నారని అభిమానులు చెప్పుకొచ్చేస్తున్నారు.  బుచ్చి సినిమాలో హీరోయిన్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పెద్దిలో కూడా జాన్వీకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే.


 

తాజాగా ఈ షూటింగ్ లో పాల్గొనడానికి జాన్వీ హైదరాబాద్ కు చేరుకుంది. మొన్నటివరకు కేన్స్ ఫెస్టివల్ లో హొయలు ఒలికించిన ఈ చిన్నది.. పెద్ది షూటింగ్ కోసం హైదరాబాద్ కు చేరుకుంది. నేటి ఉదయం ఎయిర్ పోర్టులో అతిలోక సుందరి ఆగమనం జరిగింది. ఇక దీంతో పెద్ది షూట్ కోసమే జాన్వీ హైదరాబాద్ వచ్చినట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో చరణ్.. ఒక ప్లేయర్ గా కనిపించనున్నాడు. విలేజ్ స్టైల్లో గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో రంగస్థలం లుక్ ను గుర్తుచేశాడు.

 

ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సోలో హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ, కథలో అంత దమ్ము లేకపోవడంతో ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఇక ఇప్పుడు అందరి ఆశలు పెద్ది పైనే పెట్టుకున్నారు. అందులోనూ మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్న బుచ్చి బాబు చాలాకాలం ఎదురుచూసి పెద్దిని మొదలుపెట్టాడు. మొదటి షాట్ తోనే పెద్ది సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో బుచ్చి – చరణ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను ఎలా తిరగరాస్తారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×