BigTV English
Advertisement

Banana Peel: అరటి తొక్కలు పడేస్తున్నారా ? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు అలా చేయరు

Banana Peel: అరటి తొక్కలు పడేస్తున్నారా ? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు అలా చేయరు

Banana Peel: పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీగా పిలవబడే అరటిపండులో పోషక మూలకాలు ఫుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలుసిన విషయమే. అరటి పండుతోనే కాదు అరటి తొక్కతో కూడా బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా అరటిపండ్లు తిన్న తర్వాత తొక్కలను పారేస్తూ ఉంటారు. కానీ అరటి తొక్కలు చర్మ సంరక్షణలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు యొక్క మెరుపును పునరుద్ధరించడబడుతుంది. ఇది మాత్రమే కాదు.. అరటి తొక్క కొన్ని ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.


అందాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇలా కాకుండా అరటిపండు తొక్కను వాడటం వల్ల కూడా అందం పెరుగుతుంది. ఒక్క సారి అరటి తొక్కను ఉపయోగించిన తర్వాత కనిపించే ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి కూడా.

అరటి తొక్క యొక్క ప్రయోజనాలు..


చర్మ సంరక్షణ: అరటి తొక్క ముఖాన్ని అందంగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది అరటిపండు తొక్కను మీ ముఖానికి మాస్క్‌గా ఉపయోగించవచ్చు. అరటిపండు తొక్కను ముఖ చర్మంపై అప్లై చేయడం వల్ల మీ ఫేస్ యొక్క రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయి. అరటిపండు తొక్క చర్మాన్ని తేమగా ఉంచుతుంది. తరుచుగా అరటి తొక్కను ముఖంపై రాయడం వల్ల మొటిమలు, మచ్చలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.

జుట్టు సంరక్షణ: అందాన్ని పెంచడంలో జుట్టు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెల్తీ అండ్ షైనీ హెయిర్ వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే అరటిపండు తొక్కలను పేస్ట్‌గా తయారు చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. తరుచుగా అరటి తొక్కలతో తయారు చేసిన పేస్ట్ హెయిర్‌కు వాడటం వల్ల మీ జుట్టులో బలంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది.

దంతాల కోసం: తెల్లగా మెరిసే పళ్లతో ఏ వ్యక్తికైనా అందం కూడా పెరుగుతుంది. అరటిపండు తొక్కను దంతాలపై రుద్దడం వల్ల వాటి తెల్లదనం రెట్టింపు అవుతుంది. ఇది పంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా చిగుళ్ళ వాపును కూడా నివారిస్తుంది.

Also Read: వీటితో.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం

గార్డెనింగ్‌లో ఉపయోగించండి: చర్మ సౌందర్యానికే కాకుండా, అరటి తొక్క తోటపనిలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది సేంద్రీయ ఎరువులు తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అరటి తొక్క యొక్క ఎరువు మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది.

షైన్ లెదర్ షూస్: అరటి తొక్క లెదర్ షూస్‌లను మెరుస్తూ కనిపించేలా చేస్తాయి. మీ బూట్లపై మరకలు కనిపిస్తే, వాటిపై అరటిపండు తొక్కను రుద్దండి. ఇది బూట్ల మెరుపును పెంచుతుంది. అదేవిధంగా, వెండి పాత్రలను కూడా అరటి తొక్క సహాయంతో శుభ్రం చేయవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×