Beauty Tips : వృద్ధాప్య లక్షణాలు, శారీరక మార్పుల కారణంగా అందం క్రమంగా తగ్గ్గుతుంది. అంతే కాకుండా చర్మం గరుకుగా మారి రంగు మారడం కూడా కొందరిలో ప్రారంభం అవుతుంది. కానీ కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా ఏజ్ పెరుగుతున్నా కూడా మీరు యంగ్‌గా కనిపిస్తారు. వయస్సు పెరగడం అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. వయస్సు పెరుగుతున్నా కూడా మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా, యవ్వనంగా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు కొన్ని ప్రత్యేక పనులను చేయాల్సి ఉంటుంది. ఆహారంతో పాటు జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. మరి ఎలాంటి టిప్స్ పాటిస్తే యవ్వనంగా కనిపిస్తాము అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాహారం:
వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే అందం చెక్కుచెదరకుండా ఉంటుంది. దీని కోసం మీరు తినే ఆహారంలో పోషక పదార్థాలు తప్పకుండా చేర్చుకోవాలి. పండ్లు, పప్పులు, తృణధాన్యాలతో పాటు కూరగాయలను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తగినంత నిద్ర అవసరం:
వయసు పెరిగే కొద్దీ శరీరం త్వరగా అలసిపోతుంది. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడానికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. మీకు తగినంత నిద్ర లేకపోతే మీ చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా అంద విహీనంగా కనిపిస్తుంది. అందుకే ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే మాత్రం తగినంత నిద్ర పోవడానికి ట్రై చేయండి.
తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే మేకప్ వేసుకోండి:
సరైన మొత్తంలో మేకప్ వేసుకుంటే అందం తగ్గదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా మేకప్ వేసుకోవడం మానుకోవాలి. మీరు ఎండలో బయటకు వెళ్ళినప్పుడల్లా సన్‌స్క్రీన్ తప్పకుండా ఉపయోగించండి. ఇది మీ చర్మాన్ని హానికరమైన సూర్య కిరణాల నుండి రక్షిస్తుంది.
క్రమం తప్పకుండా యోగా చేయండి:
ప్రతి దశలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యోగా మేలు చేస్తుంది. రోజు యోగా చేస్తే శారీరక వ్యాధులు నయం కావడమే కాకుండా చర్మం నిర్జీవంగా మారకుండా ఉంటుంది. అదనంగా, యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిగి కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఒత్తిడి మీ శరీరాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.
చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి:
వయసు పెరిగే కొద్దీ చర్మంపై అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం మీరు టోనర్, క్లెన్సర్ , మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు. అదనంగా, పెప్టైడ్స్, రెటినోల్ , సిరమైడ్లను కూడా వాడాలి. వయస్సు పెరిగినంత మాత్రాన చర్మ సౌందర్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. తప్పకుండా కొన్ని రకాల స్కిన్ పాటించాలి.
Also Read: 7 రోజులు ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి:
కొన్ని రకాల టిప్స్ గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా పని చేస్తాయి. అందుకే టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ అందాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలంటే విజ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ పాజిటివ్ థింకింగ్ తో ముందుకు సాగాలి.