Bengaluru Techie Suicide: సాధారణంగా అబ్బాయిలు మోసం చేశారంటూ.. అమ్మాయులు పెళ్లయ్యాక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం అమ్మాయులు మోసం చేశారని.. భార్య వేధిస్తోంది అంటూ భర్త ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్యనే పెరుగుతున్నాయి. తాజాగా ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.
కుటుంబ కలహాలు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణలు తీశాయి. భార్యతో ఏర్పడిన విభేదాలు మానసిక వేదనకు గురిచేశాయి. జీవితంపై విరక్తి కలిగిన అతుల్ సుభాష్ అనే ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. 34 ఏళ్ల అతుల్ 24 పేజీల సుసైడ్ నోట్‌ను రాశాడు. తన చావుకు భార్య, భార్య కుటుంబ సభ్యులే కారణమని లేఖలో వివరించాడు. తాను సంపాదిస్తున్న డబ్బులు తన శత్రువులకు ఉపయోగపడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ కలహాల వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో అతుల్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. చావే తన సమస్యకు శాశ్వత పరిష్కారమని భావించాడు. సుసైడ్ నోట్ రాసి తన స్నేహితులు చాలా మందికి పంపాడు.
అయితే అతుల్ సుభాష్.. తన ప్రాణం కొంత మందికి అయినా కనువిప్పు కావాలనుకున్నాడో ఏమో.. భార్యతో వేధింపులు.. తాను ఎదుర్కున్న సమస్యలన్ని ఆ సూసైడ్ లెటర్‌లో రాశారు. చివరగా తనకు న్యాయం జరగాలని ప్లకార్డును పట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీవత భాగస్వాముల తప్పుల కేసుల్లో ఇరుకున్న భాదితులకు న్యాయం చేసే ‘సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్’ అనే సంస్థలో సభ్యుడిగా ఉన్నారు అతుల్. తన సూసైడ్ లెటర్‌ను ఆ సంస్థ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. మీకు కుదురితే తన కుటుంబానికి న్యాయం చేయండి అంటూ ఆ లెటర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read: పెళ్ళాం ఊరెళ్లిందని.. ఓ భర్త చేసిన నిర్వాకం.. ఏకంగా కన్న కొడుకుపైనే..
అతుల్ సుభాష్ సూసైడ్ చేసుకోవడానికి.. ఓ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. సూసైడ్ చేసుకునే ముందు స్నానం చేయాలి. 100 సార్లు శివనామస్మరణం చదవాలి.. ఉన్న అప్పులను తీర్చేయాలి. తన సూసైడ్ లెటర్‌ను హైకోర్టుకు, పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిసేలా మెయిల్ పంపాలనుకున్నాడు. ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయ్యాక.. ల్యాప్ టాప్ కెంపెనీకి సబ్ మిట్‌చేసి.. ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే తన డైరీలో రాసుకున్నారు.
I am really pained deep in my heart, after reading Late Atul Subhash's Suicide note#GenderBiasedLaws pic.twitter.com/QxB8WMq2oR
— Men's Rights Foundation (@JusticeForMen1) December 9, 2024