Manchu Mohan Babu: అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఒక్కసారిగా ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి? గత కొన్నిరోజులుగా ఈ గొడవలు బయటికి రాకుండా కవర్ చేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల మైండ్‌లో తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో నేరుగా అసలు తమ మధ్య జరిగిన గొడవ ఏంటో చెప్పకుండా తన పాత సినిమాలకు సంబంధించిన సీన్స్‌ను వరుసగా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఉన్నారు మోహన్ బాబు. అది ఆయన మంచు మనోజ్‌కు ఇన్‌డైరెక్ట్‌గా ఇస్తున్న కౌంటర్ అని నెటిజన్లు భావిస్తున్నారు. అదే సమయంలో తాజాగా ఆయన హీరోగా నటించి, నిర్మించిన ‘ప్రతిజ్ఞ’ సినిమా నుండి ఒక సీన్ షేర్ చేశారు మోహన్ బాబు.
ఇన్‌డైరెక్ట్ కౌంటర్
ఆస్తుల విషయంలోనే మంచు మనోజ్ (Manchu Manoj)కు, మోహన్ బాబు (Mohan Babu) అనుచరులకు మధ్య గొడవ మొదలయ్యిందని తాజాగా పనిమనిషి క్లారిటీ ఇచ్చింది. ‘ప్రతిజ్ఞ’ సినిమాలో ఇలా ఆస్తి తగాదాలకు సింక్ అయ్యే ఒక సీన్‌ను ఈ సందర్భంగా షేర్ చేశారు మంచు మోహన్ బాబు. ఇక ఈ సీన్‌లోని డైలాగులు కూడా ఇన్‌డైరెక్ట్‌గా మనోజ్‌కు కౌంటర్ ఇస్తున్నట్టుగానే అనిపిస్తున్నాయి. ఇద్దరు రైతుల దగ్గరకు వచ్చిన ఒక జమీందార్.. తమను డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెడుతుంటే మోహన్ బాబు అడ్డుపడతారు. ‘‘పేదోడయినా, పెద్దోడయినా ఎదుటివాడు కూడా మనిషేనని గుర్తించాలి. డబ్బు, ఆస్తి ఉంది కదా అని బలంతో జులుమ్ చలాయిస్తే పిల్లి కూడా పెద్ద పులై తిరగబడుతుంది’’ అని అంటారు.
Also Read: భూమా మౌనిక వల్లే మంచు ఫ్యామిలీలో గొడవలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పనిమనిషి
కుక్కలతో పోలిక
చివరిగా ఈ సీన్‌లో ‘‘ఈ ఊరిలో దొంగచాటుగా తినమరిగిన కుక్కలు కొన్ని ఉన్నాయి. అవి మొరుగుతూ మీదికొస్తాయి. భయపడి పరిగెత్తారా వెంటపడి కరుస్తాయి. ఆగి ఎదురుతిరిగారా భయంతో తోకలు ముడుస్తాయి. కారణం.. ఇవి ఊరకుక్కలు కనుక’’ అనే డైలాగ్ చెప్తారు మోహన్ బాబు. ఇలా డబ్బుపై ఆశపడేవారిని కుక్కలతో పోలుస్తూ, పిల్లులతో పోలుస్తూ మోహన్ బాబు చెప్తున్న డైలాగ్ కచ్చితంగా తన కుమారుడు మనోజ్‌కు కౌంటర్ ఇచ్చినట్టుగానే ఉందని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. మంచు మనోజ్.. భూమా మౌనికను పెళ్లి చేసుకున్న విషయంలో మోహన్ బాబు ఇంకా సీరియస్‌గా ఉండగా.. ఇప్పుడు దానికి ఆస్తి తగాదాలు కూడా తోడయ్యాయి.
సపోర్ట్ లేదు
మంచు ఫ్యామిలీలో మనోజ్ మాత్రమే కాస్త డిఫరెంట్‌గా ఉంటాడని ప్రేక్షకులు ఎప్పటినుండో ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి మనోజ్.. భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకోవడంతో తన పర్సనల్ లైఫ్ కూడా అందరిలో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి మౌనికను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మనోజ్‌కు మంచు ఫ్యామిలీ నుండి సపోర్ట్ దక్కలేదు. అంతే కాకుండా ఈ పెళ్లికి కూడా కేవలం మంచు లక్ష్మి మాత్రమే హాజరయ్యింది. పెళ్లి బాధ్యతలు అన్నింటిని తానే చూసుకుంది. ఆ తర్వాత మనోజ్, మౌనిక.. మంచు ఫ్యామిలీతో కలిసి కనిపించలేదు.
A beautiful village-based drama and one of my cherished films 'Pratigna'(1982), directed by Sri. Boyani Subbarao, it became a super hit of its time! I thoroughly enjoyed playing an energetic role in this memorable story. My first film as a producer and launch of 'Sree Lakshmi… pic.twitter.com/xpDaUpWveM
— Mohan Babu M (@themohanbabu) December 10, 2024