E-Paper
Advertisement

బీర్‌కు బ్రీజర్స్‌కు మధ్య తేడా ఏంటీ? ఏది ఆరోగ్యకరం? ఏది డేంజర్?

బీర్‌కు బ్రీజర్స్‌కు మధ్య తేడా ఏంటీ? ఏది ఆరోగ్యకరం? ఏది డేంజర్?
Advertisement

Beer vs Breezer: సండే వచ్చిందంటే చాలు.. దోస్తులతో కలిసి చిల్ అవ్వడానికి చాలా మంది బీర్ లేదా బ్రీజర్ వైపు మొగ్గు చూపుతుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు బీర్లను ప్రిఫర్ చేస్తే, ఆల్కహాల్ ఘాటు నచ్చని వారు, అమ్మాయిలు కలర్‌ఫుల్ బ్రీజర్స్‌ను ఇష్టపడతారు. అయితే.. చూడటానికి కూల్‌గా కనిపించే ఈ రెండింటిలో ఏది సేఫ్? దేనిలో ఆల్కహాల్, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి? ఆరోగ్య పరంగా చూస్తే ఏది బెటర్, ఏది ఎక్కువ డేంజర్ అనే అసలు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్ Vs బ్రీజర్: ఏది సేఫ్.. ఏది డేంజర్?

వీకెండ్ వచ్చిందంటే.. చాలు పార్టీల్లో రంగురంగుల బ్రీజర్లు, చిల్డ్ బీర్లు కనిపించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. చాలా మంది బ్రీజర్ అనేది ఒక రకమైన లైట్ బీర్ అని, ఇందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్‌కి పెద్దగా హాని చేయదని భ్రమపడుతుంటారు. మరి కొందరేమో బీర్ తాగితే పొట్ట వస్తుందని దూరంగా ఉంటారు. కానీ.. సైన్స్ ఏం చెబుతోంది? ఈ రెండింటి తయారీ విధానం ఏంటి? హెల్త్ పరంగా ఏది కాస్త బెటర్?

1. బేస్ ఆల్కహాల్ లోనే అసలు తేడా:

Advertisement

మొదటి విషయం ఏంటంటే.. ఇవి రెండూ పూర్తిగా వేర్వేరు డ్రింక్స్.

బ్రీజర్స్: దీనిని ‘రెడీ-టు-డ్రింక్’ ఆల్కహాలిక్ డ్రింక్ అంటారు. ఇందులో బేస్ ఆల్కహాల్‌గా ‘రమ్'(Rum)ను ఉపయోగిస్తారు. ఈ రమ్‌కు రకరకాల ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, సోడా,కెమికల్ రంగులు చక్కెరను కలిపి కలర్‌ఫుల్‌గా మారుస్తారు.

Advertisement

బీర్: ఇది వందకు వంద శాతం సహజమైన పద్ధతిలో తయారవుతుంది. బార్లీ, గోధుమలు వంటి ధాన్యాలను నీటితో కలిపి, ‘హాప్స్’అనే ఒక రకమైన పువ్వులను వాడి, నాచురల్ గా పులియబెట్టడం ద్వారా బీర్‌ను తయారు చేస్తారు.

2. ఆల్కహాల్ శాతం ఎంత ఉంటుంది?

చాలా మంది బ్రీజర్లను ఒక సాఫ్ట్ డ్రింక్ లాగా భావించి ఓ రేంజ్‌లో లాగించేస్తుంటారు. కానీ ఒక మైల్డ్ బీర్‌లో ఉండే ఆల్కహాల్ శాతం (4% నుంచి 5%), బ్రీజర్‌లో ఉండే ఆల్కహాల్ శాతం (4.8%) దాదాపు ఒక్కటే. కాబట్టి కిక్ పరంగా రెండూ సమానమే. అయితే స్ట్రాంగ్ బీర్లలో మాత్రం ఆల్కహాల్ 8% లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.

3. షుగర్ కంటెంట్: బ్రీజర్లలో ‘స్వీట్ పాయిజన్’!

బీర్‌కు,బ్రీజర్‌కు మధ్య ఉన్న అతి పెద్ద డిఫరెన్స్ ఇదే. బ్రీజర్స్ తాగడానికి జ్యూస్ లాగా చాలా తీపిగా ఉంటాయి. ఎందుకంటే అందులో విపరీతమైన చక్కెర కంటెంట్ ఉంటుంది.
ఒక బ్రీజర్ బాటిల్ తాగితే దాదాపు 30 గ్రాముల (సుమారు 7 చెంచాల) చక్కెర మీ బాడీలోకి వెళ్తుంది. ఇది మీ బరువును రాకెట్ లాగా పెంచేయడమే కాకుండా.. డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులకు నేరుగా దారి తీస్తుంది. అదే బీర్ విషయానికి వస్తే.. ఇందులో డైరెక్ట్ చక్కెర చాలా తక్కువ. ధాన్యాల నుంచి వచ్చే కార్బోహైడ్రేట్లు మాత్రమే ఇందులో ఉంటాయి.

4. పోషక విలువలు దేనిలో ఎక్కువ?

బీర్: ధాన్యాల నుంచి నాచురల్ గా తయారవడం వల్ల బీర్‌లో విటమిన్-బి (B-vitamins), పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతో పాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు కొద్ది మోతాదులో దొరుకుతాయి.

బ్రీజర్: ఇందులో కేవలం రమ్, షుగర్ వాటర్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి పోషక విలువలు ఉండవు. కేవలం ‘ఖాళీ కేలరీలు’మాత్రమే లభిస్తాయి.

ఏది సేఫ్.. ఏది డేంజర్?

ఆరోగ్య కోణం నుంచి చూస్తే ఆల్కహాల్ ఉన్న ఏ డ్రింక్ కూడా 100% మంచిది కాదు. అతిగా తాగితే.. రెండూ లివర్‌ను నాశనం చేస్తాయి. కానీ.. ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు బ్రీజర్ కంటే బీర్ తాగడమే కాస్త బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. బ్రీజర్‌లో ఉండే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, విపరీతమైన చక్కెర బాడీ మెటబాలిజాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. కాబట్టి.. టేస్ట్ బాగుందని బ్రీజర్లను కూల్ డ్రింక్స్ లాగా ఎక్కువగా తాగేస్తే మాత్రం ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఏదైనా లిమిట్‌లో ఉంటేనే సేఫ్ (పురుషులు రోజుకు గరిష్టంగా 1 మైల్డ్ బీర్, మహిళలు చిన్న గ్లాస్). అంతకు మించితే మాత్రం హెల్త్ రిస్క్‌లో పడటం ఖాయం.

Related News

సింపుల్, డౌన్ టు అర్త్.. ఈ తేదీల్లో పుట్టినవారు సాదాసీదా జీవనం ఇష్టపడతారు

మీ పిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నారా? బలమైన బంధం కోసం తల్లిదండ్రులకు 5 ఈజీ టిప్స్

వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడం ఎక్కువ.. స్కూటీ నడిపే సమయంలో ఈ 10 జాగ్రత్తలు పాటించాలి

తొలిప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం.. దీనికి నాలుగు కారణాలు ఇవే

మహాశివుడి ప్రియమైన మొక్కలు.. శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలతో ప్రశాంతత, పచ్చదనం

చిన్న కిచెన్‌ను పెద్దదిలా చూపించే సింపుల్ ట్రిక్స్!

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

Big Stories

Advertisement
×