E-Paper

పాకిస్తాన్ క్రికెట్ లో ముస‌లం…అత‌నితో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన న‌ఖ్వీ

పాకిస్తాన్ క్రికెట్ లో ముస‌లం…అత‌నితో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన న‌ఖ్వీ
Advertisement

Mohsin Naqvi – Aaqib Javed:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో (Pakistan Cricket Board) ముసలం నెలకొంది. వరుసగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు విఫలమవుతున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. గత ఏడాది కాలంగా పాకిస్తాన్ పురుషులు, మహిళల జట్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సమూల మార్పులు చేయాలని PCB కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొత్త కోచ్ లు, ఫిట్నెస్ స్టాప్ ను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే చాలామందితో చర్చలు కూడా జరుపుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

పాకిస్తాన్ క్రికెట్ లో ముస‌లం…బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన న‌ఖ్వీ

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో సమూలం మార్పులు చేసే క్రమంలో కీలక పరిణామాలు కూడా జరుగుతున్నాయి. కొందరిపై వేటు వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది బోర్డు. ఇందులో భాగంగానే మొదటి వేటు ఆకిబ్ జావేద్ పైన పడనుందట. హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఆకిబ్ జావేద్ స్థానంలో మరొకరిని నియమించేందుకు PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi ) నిర్ణ‌యం తీసుకున్నార‌ని నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే బ‌ల‌వంతంగా ఆకిబ్ జావేద్ తో (Aaqib Javed) రాజీనామా కూడా చేయించాడ‌ట న‌ఖ్వీ. పాకిస్తాన్ పురుషులు, మహిళల జట్ల ప్రదర్శన ఏమాత్రం సరిగ్గా లేదన్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క కారణం చూపించి ఆకిబ్ జావేద్ పైన వేటు వేసేందుకు PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi ) నిర్ణయం తీసుకున్నారట. అతని స్థానంలో మరో కొత్త వ్యక్తికి అవకాశం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరియం నవాజ్ షరీఫ్ (Maryam Nawaz Sharif) ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్ జ‌ట్టులో వేలు పెట్టిన కిలాడీ లేడీ

అంతేకాదు ఈ నేషనల్ హైవే పెర్ఫార్మెన్స్ సెంటర్ చీఫ్ గా ఆకిబ్ జావేద్ అన్న తొలగించి.. అతని స్థానంలో మరియం నవాజ్ షరీఫ్ ను నియమించాలని కూడా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా చెబుతున్నారు. చాలా రోజులుగా ఈ పదవిపై మరియం నవాజ్ షరీఫ్ (Maryam Nawaz Sharif) మోజు పడుతున్నారట. అందుకే ఆమె కోసం ఆకిబ్ జావేద్ ను బలి పశువు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే మరియం న‌వాజ్ ష‌రీఫ్ ఆ బాధ్యతలను తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ పాకిస్తాన్ నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ లో క్రికెటర్లకు ఫిట్నెస్ టెస్టులు చేస్తారు. నైపుణ్యాలను నేర్పిస్తారు. గాయాల బారిన పడితే, ట్రీట్మెంట్ అందిస్తారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దె శిక్షణ ఇక్కడ ఉంటుంది.

Advertisement

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

 

 

Related News

పాకిస్తాన్ కు మ‌రో టెన్ష‌న్‌…టాప్ 8లో నిల‌వ‌క‌పోతే అంతే సంగ‌తులు, 2028లో క‌ష్ట‌మే

ఎంతో క‌ష్ట‌ప‌డి జై షా ఈ స్థాయికి ఎదిగాడు..ఎవ‌రినీ బెదిరించి ICC ప‌ద‌వి ద‌క్కించుకోలేదు ! !

Kris Srikkanth: వైభ‌వ్ టెస్టులు ఆడితే, జ‌నాలు టీవీలకే అతుక్కుపోతారు

రేపే ట్రై సిరీస్ ఫైన‌ల్స్‌..వైభ‌వ్ దెబ్బ‌కు లంక ప్లేయ‌ర్ల ప్యాంట్లు త‌డ‌వ‌డం గ్యారెంటీ

బాబ‌ర్ ఆజంకు CA కంపెనీ కోట్ల‌ల్లో ఆఫ‌ర్..ఆసియాలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్ !

శ్రీశాంత్ కూతురు న‌న్ను ప‌చ్చిబూతులు తిట్టింది..హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నం !

Aqib Javed: మంత్ర దండం వేసి, పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే బాగు చేయ‌లేం

Big Stories

×