Beetroot For Skin Glow: మెరుగైన ఆరోగ్యం, చర్మం కోసం బీట్‌రూట్ చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. బీట్‌రూట్ ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన సూపర్‌ఫుడ్ మాత్రమే కాదు. ఇది చర్మానికి సూపర్ నేచురల్ బ్యూటీ ఇంగ్రీడియెంట్ కూడా. బీట్‌రూట్‌లో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని తరచుగా ముఖానికి వాడటం వల్ల గులాబీ రంగు మెరిసే చర్మాన్ని పొందడం సులభం అవుతుంది.
చాలా మంది సెలబ్రిటీ చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెలబ్రిటీలు శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, గ్లాసీ స్కిన్ పొందడానికి బీట్‌రూట్‌ను ఉపయోగిస్తారు. మీరు కూడా సహజంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే బీట్ రూట్ ఉపయోగించవచ్చు. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం బీట్ రూట్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం నుండి పిగ్మెంటేషన్ , మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు, బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.
బీట్‌రూట్‌లో అనేక ఇతర ఆరోగ్యకరమైన పోషకాలతో పాటు.. ఐరన్ కూడా ఉంటుంది.ఇది దెబ్బతిన్న చర్మ కణాలను సహజంగా మరమ్మతు చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో చర్మానికి అత్యంత ఆరోగ్యకరమైన, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన బీటాలైన్‌లు ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.
హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్:
పొడి చర్మాన్ని సహజంగా హైడ్రేట్ గా, తేమగా మార్చడానికి బీట్‌రూట్‌ను తురుముతూ మందపాటి పేస్ట్‌ను సిద్ధం చేయండి. బీట్‌రూట్ పేస్ట్‌లో ఒకటి నుండి రెండు చెంచాల కలబంద జెల్ వేసి బాగా కలిపి.. ముఖానికి అప్లై చేసిన తర్వాత.. 15 నుండి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
స్పష్టమైన చర్మం కోసం ఫేస్ మాస్క్:
చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే మీరు కాస్త బీట్‌రూట్ పొడిని తీసుకుని దానికి నీరు, రోజ్ వాటర్ లేదా పచ్చి పాలతో కలిపి మందపాటి ఫేస్ మాస్క్‌ను సిద్ధం చేసుకోండి. వారానికి మూడు నుండి నాలుగు సార్లు ముఖానికి అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ బీట్‌రూట్ ఫేస్ మాస్క్ ముఖం నుండి అదనపు సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
గ్లాసీ స్కిన్ కోసం:
సెలబ్రిటీల మాదిరిగా గ్లాసీ చర్మాన్ని పొందడానికి.. రెండు నుండి మూడు చెంచాల బియ్యం పిండిని విటమిన్ సి అధికంగా ఉండే బీట్‌రూట్ పొడితో కలిపి, నీరు లేదా రోజ్ వాటర్ సహాయంతో పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల తర్వాత సున్నితంగా స్క్రబ్ చేయండి. మెరిసే చర్మం కోసం.. వారానికి రెండుసార్లు దీనిని వాడటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
Also Read: బార్లీ వాటర్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
గులాబీ లాంటి గ్లో:
ప్రత్యేకమైన గులాబీ రంగు లాంటి, మెరిసే చర్మాన్ని పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బీట్‌రూట్‌ను మధ్యలో కోసి.. మీ ముఖంపై వృత్తాకారంగా మసాజ్ చేయడం ద్వారా మీరు ప్రకాశవంతమైన , ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. 2 నిమిషాల్లోనే ఇలా చేయడం వల్ల మీరు రిజల్ట్ చూడవచ్చు. దీని కోసం.. మీరు మీ చర్మాన్ని ప్రతిరోజూ సహజ బీట్‌రూట్‌తో మసాజ్ చేయాలి.