Barley Water: బార్లీ వాటర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి , అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. బార్లీ వాటర్ తాగడం వల్ల శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడమే కాకుండా, చర్మ కాంతిని కూడా మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. అంతే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.
బార్లీ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. జీర్ణక్రియ మెరుగుదల:
బార్లీ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో బీటా-గ్లూకాన్‌లు కూడా ఉంటాయి. ఇవి మంచి గట్ బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ ఒక గ్లాసు బార్లీ నీరు తాగడం వల్ల గట్ మైక్రోబయోటా ఆరోగ్యంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
2. మూత్రపిండాలకు మేలు:
బార్లీ నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇది మీ శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక సహజ మార్గం. ఇది UTI లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా దీన్ని రోజూ తాగడం వల్ల మూత్రపిండాల్లో కాల్షియం పేరుకుపోకుండా నిరోధించవచ్చు. అంతే కాకుండా బార్లీ వాటర్ మూత్రపిండాల్లో రాళ్లను కూడా నివారిస్తుంది.
3. బరువు తగ్గుదల:
బరవు తగ్గాలని అనుకునే వారు బార్లీ వాటర్ తాగడం చాలా మంచిది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగిన తర్వాత, కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా ఇది ఆకలి తగ్గిస్తుంది. అదనంగా.. జీవక్రియను పెంచే దాని సామర్థ్యం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
4. రక్తంలో చక్కెర స్థాయి:
డయాబెటిస్ ఉన్నవారికి లేదా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నవారికి కూడా బార్లీ నీరు తాగడం చాలా మంచిది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బార్లీలో విటమిన్ సి, ఐరన్ , మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బార్లీ నీరు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ లేదా అనారోగ్యం నుండి రక్షిస్తుంది. తద్వారా ఏడాది పొడవునా మంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బార్లీ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ అంశాలు ఒత్తిడిని తగ్గించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. బార్లీలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి ఇన్సులిన్ హార్మోన్లను సమతుల్యం చేయడానికి పనిచేస్తాయి. అందుకే డయాబెటిస్ ఉన్న రోగులకు బార్లీ నీటిని అమృతంలా భావిస్తారు.
బార్లీ వాటర్ ఎలా తయారు చేయాలి ?
బార్లీ నీటిని తయారు చేయడానికి.. మీకు బార్లీ 2 టీస్పూన్ల నిమ్మరసం, తేనె , ఒక గ్లాసు నీరు అవసరం. బార్లీ నీటిని తయారు చేయడానికి.. ముందుగా కాస్త బార్లీని నీటిలో బాగా కడగాలి. దానిలోని మురికి అంతా తొలగిపోతుంది. తర్వాత గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు, బార్లీ, నిమ్మరసం వేసి మరిగించాలి. నీటి రంగు ముదురు రంగులోకి మారిన వెంటనే.. మంటను ఆపివేయండి. దీన్ని ఒక గ్లాసులో పోసి.. తేనె వేసి, వేడిగా తినండి.
Also Read: షుగర్ ఉన్న వాళ్లు.. మామిడి పండు తినొచ్చా ?
ఏ సమయంలో తాగాలి ?
మధుమేహంతో బాధపడుతున్న వారు ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో దీనిని తాగవచ్చు. మీరు దీన్ని క్రమం తప్పకుండా తిగాలని అనుకుంటే మాత్రం ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పటికీ.. దీనిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.