BigTV English

Belly Fat Detox Drink: నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా?.. ఈ డిటాక్స్ డ్రింక్ తో కరిగించేయండి..

Belly Fat Detox Drink: నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా?.. ఈ డిటాక్స్ డ్రింక్ తో కరిగించేయండి..

Belly Fat Detox Drink| ఆధునిక జీవనశైలిలో రుచికర భోజనం, జంక్ ఫుడ్ కు అలవాటు పడి చాలామంది ఊబకాయంతో బారిన పడుతుంటారు. అయితే కొందరు మాత్రం ఆ ఊబకాయం సమస్య నుంచి బయటపడడానికి ఎంతో శ్రమపడి బరువు తగ్గినా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని మాత్రం కరిగించడం చాలా కష్టం.


అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఇంట్లో రోజూ ఉపయోగించే పదార్థాలు ఉపయోగించి ప్రత్యేకంగా డిటాక్స్ డ్రింక్స్ తయారు చేసుకుంటే ఆ కొవ్వుని కరిగించేందుకు ఆ డ్రింక్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. న్యూట్రిషన్ నిపుణురాలు డాక్టర్ రీచా గంగానీ ఈ డిటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో సూచించారు.

డాక్టర్ రీచా గంగానీ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఈ డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే కడుపులో ఉబ్బసం సమస్య తొలిగిపోవడంతో పాటు నడుము చుట్టూ ఉన్న కొవ్వుకూడా క్రమంగా కరిగిపోతుంది.


Also Read: చిన్న వయసులోనే డయాబెటీస్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

నడుము చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించేందుకు ఉపయోగపడే డిటాక్స్ డ్రింక్ ఎలా పనిచేస్తుందంటే..

జింజర్, టర్మరిక్, తులసి, లెమన్, నేయి ఈ 5 పదార్థాలతో ఒక డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవాలి.

1. జింజర్ (అల్లం): జింజర్ అంటే అల్లం లో జింజెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ప్రకారం.. ఈ జింజెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొవ్వుని కరిగిస్తుంది. ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

2. లెమన్ : విటమిన్ పుష్కలంగా ఉన్న సిట్రిక్ యాసిడ్ పండు నిమ్మకాయ. ఈ డ్రింక్ తాగితే.. కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ నియంత్రణలో ఉంటుంది. ఫ్యాట్ లాస్ కు ఉపయోగపడుతుంది. దీనిలోని డయురెటిక్ గుణాలు శరీరాన్ని డిటాక్సిఫై (మలినాలు తొలగించి), ఆహారం అరుగుదలలో తోడ్పడతాయి.

3. టర్మరిక్ (పసుపు): టర్మరిక్ లో కుర్‌కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. పసుపుని పేస్ట్ చేసి దాన్ని డ్రింక్ లో కొద్దిగా కలిపి తీసుకుంటే .. అందులోని కుర్‌కుమిన్ వల్ల పాన్‌క్రియాస్, కండారాల్లో వాపు తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు నిల్వలు కూడా తగ్గిపోతాయి. బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది.

Also Read: గుండె పోటు, పక్షవాతం రాకుండా కాపాడే ఫుడ్స్ ఇవే..

4. తులసి : తులసి ఆకుల్లో ఒక ప్రత్యేకమైన ధ్రవ పదార్థముంటుంది. దాని పేరు యుజెనాల్. తులసి ఆకులు నూరి డ్రింక్ తో కలిపి తీసుకోవడం వల్ల అందులోని యుజెనాల్ ఆయిల్ శరీరంలో ఎముకల జాయింట్లలో వాపు తగ్గించడంతో పాటు పొట్ట, ప్రేగుల్లో జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. తులసి డ్రింక్ వల్ల మరో ముఖ్యమైన ఉపయోగం కూడా ఉంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలో హాని కలిగించే రాడికల్స్ ని నాశనం చేస్తాయి.

5. నేయి: నేయిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని అమినో యాసిడ్స్, ఫ్యాట్ సాలుబుల్ విటమిన్స్ శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించి బరువు తగ్గడానికి ఉపకరిస్తాయి.

డిటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేయాలంటే–

అల్లం ముక్కలను సన్నగా తురుముకోవాలి. నిమ్మకాయ కూడా స్లైస్ చేసి ఆ తరువాత పసుపు పేస్ట్ ని ఈ రెండింటితో కలపాలి. ఆ తరువాత తులసి ఆకులు నూరి, అందులో నేయిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక జగ్ నీటిలో బాగా కలపాలి. ఆ తరువాత ఒక ఫిల్టర్ తో ఆ జగ్గులోని నీటిని మాత్రమే ఒక కప్ లో తీసుకొని తాగాలి.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×