Sesame Oil For Skin: సీజన్ ఏదైనా చర్మం పొడిబారడం అనేది అతి పెద్ద సమస్య. కొన్ని రకాల స్కిర్ కేర్ టిప్స్ పాటించినా కూడా డ్రై స్కిన్ సమస్య తగ్గదు. ఇలాంటి సమయంలో నువ్వుల నూనె వాడటం మంచిది.
నువ్వులలో లినోలిక్, ఒలేయిక్, పాల్మిటిక్,స్టెరిక్ వంటి మోనో, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు,ఫ్లేవనాయిడ్ ఫినాలిక్ యాంటీఆక్సిడెంట్లు,విటమిన్లు (A, E, B1, B2 , B3) జింక్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి.ఇన్ని గుణాలు ఉన్న నువ్వుల నూనె మరి డ్రై స్కిన్ కోసం ఎలా ఉపయోగపడుతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి ఉత్తమ సన్‌స్క్రీన్:
నువ్వుల నూనెలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్లు సూర్య కిరణాల ప్రభావం నుండి కాపాడతాయి. అంతే కాకుండా ముఖానికి తేమను అందిస్తాయి.
మొటిమలకు ఉత్తమ చికిత్స:
నువ్వుల నూనె అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ సమస్యను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు రాకుండా ఉండేందుకు కూడా సహాయపడుతుంది.
చర్మానికి తేమను అందిస్తుంది:
నువ్వుల నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ నూనె దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు కొవ్వు ఆమ్లాలు విటమిన్లు చర్మంపై ఉన్న ముడతలను తగ్గిస్తాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న ముఖ రంధ్రాలను కూడా తగ్గిస్తాయి. నువ్వుల నూనెలో ఉండే పాలీ పెనాల్స్ చర్మం జిడ్డుగా మారకుండా చేస్తుంది.
ముఖ రంధ్రాలను మూసివేస్తుంది:
స్నానం చేసే ముందు మీ శరీరంపై గోరువెచ్చని నువ్వుల నూనె రాయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి 5 నిమిషాల పాటు ముఖంపై మర్దనా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. మీరు ప్రతి రోజు నువ్వుల నూనెను ముఖానికి వాడటం వల్ల కూడా డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది.
స్నానం చేసే ముందు, మీ శరీరంపై గోరువెచ్చని నువ్వుల నూనె రాసి, దాదాపు 10 నిమిషాలు మసాజ్ చేయండి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి వెచ్చని టవల్‌తో తుడవండి. దీని తర్వాత వెంటనే స్నానం చేయండి. మీ స్కిన్ శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు ప్రతిరోజూ ఈ దినచర్యను క్రమం తప్పకుండా అనుసరించాలి.
చర్మాన్ని శుభ్రపరుస్తుంది, మెరిసేలా చేస్తుంది:
నువ్వుల నూనె చర్మం నుండి మురికి, నూనె, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. తద్వారా చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. డ్రై స్కిన్ సమస్య ఉన్న వారు నువ్వుల నూనెను తరచుగా ముఖానికి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ముఖంపై మొటిమలా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్
ఈ నూనె చర్మ సంరక్షణకారిగా పనిచేస్తుంది:
ఈ నూనె దెబ్బతిన్న కణాలను వేగంగా మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే జింక్, రాగి, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేయగలుగుతాయి.