Varshini Sounderajan: అందాల హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ భామ చందమామ కథలు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమా నేషనల్ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టింది.
ఢీ షో వర్షిణికి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. సుధీర్, రష్మీ ఒక జంటగా.. హైపర్ ఆది, వర్షిణి మరో జంటగా మొదలైన ఆ షోలోవారి కామెడీ, డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చినప్పుడు వర్షిణి చేసిన మూన్ వాక్ స్టెప్ మరింత హైలెట్ అయ్యింది. డ్యాన్స్ రాకపోయినా ఎంతో కాన్ఫిడెంట్ గా ఆమె వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక డ్యాన్స్ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఈ మధ్య షోస్ తగ్గించిన వర్షిణి.. ప్రమోషన్స్ ఎక్కువ చేస్తుంది. తాజాగా ఒక ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన వర్షిణి.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. “ఎప్పటి నుంచో బిగ్ బాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కానీ, నాకు వెళ్లాలని లేదు. ఎందుకంటే నేను ఫోన్ లేకుండా ఉండలేను. అందరికంటే నేనే ఎక్కువ ఫోన్ వాడతాను” అని చెప్పుకొచ్చింది.
Nandamuri Balakrishna: కాలేజ్‌లో బాలయ్య లవ్ స్టోరీ.. ఒప్పుకోలేదని పగబట్టి..
ఇక ఇందులోనే హైపర్ ఆదితో తన రిలేషన్ ను కూడా బయటపెట్టింది. గత కొన్ని నెలల క్రితం వర్షిణి.. హైపర్ ఆది బర్త్ డే సెలబ్రేట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఆమె ఎవరితో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది లేదు. ఇక స్పెషల్ గా హైపర్ ఆది వీడియోను షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని, త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు పుకార్లు షికార్లు చేసాయి. ఇక ఈ పుకార్లకు వర్షిణి చెక్ పెట్టింది.
“అది.. ఆది పుట్టినరోజు అయిన మూడురోజుల తరువాత నేనే స్పెషల్ గా బర్త్ డే సెలబ్రేట్ చేశాను. ఇప్పటివరకు ఎవరి వీడియో అలా పెట్టలేదు. ఆది చాలా చాలా మంచి వ్యక్తి. నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో హైపర్ ఆది ఒకరు. లోపల నెగెటివ్ పెట్టుకొని పైకి పాజిటివ్ లా మాట్లాడడు. నేనెప్పుడూ అలా పాజిటివ్ గా ఉన్నవారితోనే ఉండాలనుకుంటాను.
నేను ఉన్నప్పుడు ఒకలా.. నేను వెళ్ళాకా వెనుక మరొకలా మాట్లాడేవారంటే నాకు అస్సలు నచ్చదు. అలాంటివారితో ఉండాలని నేను కలలో కూడా అనుకోను. నాతో ఎలాంటి నెగెటివ్ లేకుండా ఉండేవారే నా రియల్ ఫ్రెండ్స్ అని నమ్ముతాను. అలాంటివారిలో ఆది ఒకడు. నాకు ఆది మంచి స్నేహితుడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.