BigTV English

Benefits of Black Grapes : నల్ల ద్రాక్షతో జుట్టు రాలడం తగ్గుతుంది

Benefits of Black Grapes : నల్ల ద్రాక్షతో జుట్టు రాలడం తగ్గుతుంది
Benefits of Black Grapes

Benefits of Black Grapes : నల్ల ద్రాక్ష.. రుచితో పాటు ఆరోగ్యం విషయంలో కూడా ఇందులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నల్ల ద్రాక్షలో ఏ, సీ, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్‌లాంటి పోషకాలు మనల్ని చాలా వ్యాధులబారి నుంచి రక్షిస్తాయి. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తింటే ఊబకాయాన్ని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా షుగర్‌, బీపీ, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను దరిచేరనీయదు.


అంతేకాకుండా ఈ నల్ల ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మనలోని వృద్ధాప్య ఛాయలను పోగొడతాయి. యువకుల్లా కనిపిస్తారు. రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును ఈ ద్రాక్ష పండ్లు బాగా పెంచుతాయి. ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డ కట్టకుండా అడ్డుకట్ట వేస్తుంది. గుండెపోటు రావడాన్ని కూడా ఆపుతుందని వైద్యులు చెబుతున్నారు. నల్ల ద్రాక్షలోని కొన్ని పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో కూడా సమర్థవంతంగా పోరాడతాయి.

ఇందులోని ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి కండరాలకు ఎంతో మేలు చేకూరుస్తాయి. నల్ల ద్రాక్ష పండ్లను నిత్యం తింటే మన శరీరం బరువును బాగా తగ్గించుకోవచ్చు. ఊబకాయం ఉన్నవారు వీటిని ఎక్కువగా తినాలి. రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడటం ఆపడం ద్వారా ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్ష తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక రుగ్మతలు కూడా నయం అవుతాయి. మైగ్రేన్ నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది.


మధుమేహాన్ని తగ్గించడంలోనూ ఈ నల్ల ద్రాక్ష బాగా దోహదం చేస్తాయి. ఇందులో ఉన్న రెస్వెరాటల్ రక్తంలో ఇన్సులిన్ స్థాయిని బాగా పెంచుతుంది. శరీరంలోని చక్కెరను సమతుల్యం చేస్తుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలను నల్ల ద్రాక్ష తినడం వల్ల తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే విటమిన్ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. చుండ్రు, జుట్టు రాలడం, తెల్లగా మారడంలాంటివి తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ పండ్లు తింటే మన చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×