Fennel Water: సమ్మర్‌లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం పండ్లు, కూరగాయలు తినడంతో పాటు కొన్ని రకాల హోం రెమెడీస్ తీసుకోవడం కూడా అవసరం. ముఖ్యంగా సోంపుతో తయారు చేసిన హోం రెమెడీస్ సమ్మర్ లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల సమస్యలు తగ్గిస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సోంపు వాటర్‌ను ఎలా తయారు చేసుకుని తాగాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
సోంపు నీరు సమ్మర్‌లో శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా దీని శీతలీకరణ స్వభావం శరీరంలో నీటి లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వేసవిలో అజీర్ణం , గ్యాస్ సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో సోంపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది . అంతే కాకుండా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
హీట్ స్ట్రోక్ నివారణ:
సోంపు నీరు శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది. తద్వారా హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హీట్ స్ట్రోక్ నుండి బయట పడాలనుకునే వారు సోంపు వాటర్ తాగడం చాలా మంచిది.
చర్మ కాంతి:
సోంపు వాటర్ శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మాన్ని మెరుగుపరుస్తుంది , దద్దుర్లు లేదా మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది.
నిద్రను మెరుగుపరుస్తుంది:
సోంపులో సహజంగానే ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడే గుణాలు ఉంటాయి. అందుకే సౌకర్యవంతమైన నిద్ర కోసం సోంపు వాటర్ తాగడం చాలా మంచిది.
Also Read: బెల్లంతో.. చర్మ సౌందర్యం రెట్టింపు, ఇంతకీ ఎలా వాడాలో తెలుసా ?
సోంపు వాటర్ ఎలా తయారు చేసుకోవాలి ?
కావాల్సినవి:
2 టేబుల్ స్పూన్ల సోంపు గింజలు
1 టేబుల్ స్పూన్ చక్కెర (లేదా తేనె)
1/2 నిమ్మకాయ
2 కప్పుల నీరు
తయారీ విధానం:
సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టండి.
ఉదయం సోంపును బాగా మెదిపి, తర్వాత నీటిని ఫిల్టర్ చేయండి.
దీనికి కాస్త చక్కెర, నిమ్మరసం కలపండి.
చల్లగా తాగాలనుకునే వారు ఫ్రిజ్‌లో కూడా ఉంచుకోవచ్చు. లేదా ఐస్ క్యూబ్స్ కలుపుకోవచ్చు.