BigTV English

Horoscope Today April 27th : ఆర్థిక పరిస్థితులు అనుకూలం – నిరుద్యోగులకు శుభవార్తలు

Horoscope Today April 27th : ఆర్థిక పరిస్థితులు అనుకూలం – నిరుద్యోగులకు శుభవార్తలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 27న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: ఆర్థిక పరిస్థితి అంతంత  మాత్రంగా ఉంటుంది. దాయాదులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి ముఖ్యమైన పనులు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులుంటాయి.


మిధునం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి చేసే నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కర్కాటకం: కుటుంబ విషయాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

సింహం: ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారములలో ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

కన్య: ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన మానసికంగా స్థిమితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటికి బందు మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

వృశ్చికం: వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిడుకుల నుండి బయటపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

ధనస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పాత బాకీలు తీర్చడానికి నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది.

మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పాత బాకీలు తీర్చడానికి నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది.

కుంభం: ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. ఇంట్లో వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.

మీనం: స్థిరాస్తి  వివాదాలకు సంభందించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Hasanamba temple: దీపావళి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఏడాది పాటు ఆరని దీపం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Big Stories

×