Sugarcane Juice Benefits: వేసవిలో చెరకు రసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. చెరకు రసంలో ఉండే పోషకాలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. చెరకు రసంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. చెరకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా చెరకు రసం తాగడం వల్ల శరీరం నుండి హైడ్రేషన్ తొలగిపోయి శరీరానికి అవసరం అయిన ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి. దీనిలో గ్లూకోజ్ శాతం కూడా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.
ఇదిలా ఉంటే తరచుగా చెరకు రసం తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా వారానికి మూడు సార్లు చెరకు రసం తాగితే శరీరానికి బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు:
చెరకు రసంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఖనిజాలు ఎముకలు బలంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా రక్త హీనతను తగ్గించడంలో సహాయపడతాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది:
వేసవి కాలంలో మన శరీరం విపరీతంగా చెమట పడుతుంది. దీనివల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. చెరకు రసం తాగడం వల్ల మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది వేసవిలో నీటి కొరతను తీరుస్తుంది. ఇందులో పొటాషియం, సహజ చక్కెర ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, కాలేయ పని తీరుకు చాలా బాగా ఉపయోగపడతాయి.
వేసవి కాలంలో చెరకు రసం తాగడం వల్ల జీర్ణక్రియ, కాలేయం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం కడుపు యొక్క pH ని సమతుల్యంగా ఉంచుతుంది. వారానికి 3 సార్లు చెరకు రసం తాగితే కాలేయం నిర్విషీకరణ చేయబడుతుంది. అంతే కాకుండా కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి:
చెరకు రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అస్సలు పెరగదు. ఇందులో సంతృప్త కొవ్వు ఉండదు. అంతే కాకుండా చాలా తక్కువ మోతాదులో సోడియం కూడా ఉంటుంది. అందుకే ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా చెరకు రసం తాగడం అలవాటు చేసుకోవాలి.
శక్తి పెంచడం:
చెరకు రసంలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్నిచ్చే డ్రింక్ అని చెప్పవచ్చు. సమ్మర్‌లో చెరకు రసం తాగడం వల్ల క్షణాల్లోనే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
Also Read: ఉల్లిపాయ రసంలో ఈ 2 కలిపి రాస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
ఎంత చెరకు రసం తాగాలి ?
చెరకు రసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ పరిమిత పరిమాణంలో తాగడం వల్ల మాత్రమే మనం ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతాము. సాధారణ పరిస్థితుల్లో రోజుకు ఒక గ్లాసు చెరకు రసం తాగినా కూడా మంచిదే. మీరు దీన్ని తాగిన వెంటనే.. మీ శరీరంలో తాజాదనం ,శక్తి అనుభూతి చెందుతారు. వీలైతే వారానికి మూడు సార్లయినా చెరకు రసం తాగడం అలవాటు చేసుకోండి. ఇది అద్భుత ప్రయోజనాలను మీకు అందిస్తుంది.