E-Paper
Advertisement

Prabhas: నువ్వు మూడేళ్లకు ఒక సినిమా చేసినప్పుడే బాగుండేది డార్లింగ్…

Prabhas: నువ్వు మూడేళ్లకు ఒక సినిమా చేసినప్పుడే బాగుండేది డార్లింగ్…
Advertisement

Prabhas: ఈ జనరేషన్ కి పాన్ ఇండియా స్టార్ అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఈ ఆరడుగుల కటౌట్ కి బాక్సాఫీస్ దాసోహమై పోయింది. ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా, దాని ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై కచ్చితంగా ఉంటుంది. ఇతర హీరోల సూపర్ హిట్ సినిమాల కలెక్షన్ల లెక్కలు ప్రభాస్ ఫ్లాప్ సినిమాతో సమానంగా ఉంటాయి అంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రభాస్ ఇప్పుడు భారి లైనప్ ని పెట్టుకోని బాక్సాఫీస్ పై యుద్ధానికి రెడీ అయ్యాడు.

ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు కానీ ఈ లైనప్ తో అసలు సమస్య వచ్చింది. ప్రభాస్ మిర్చి తర్వాతి నుంచి మూడేళ్లకి ఒక సినిమా చేస్తూ వచ్చాడు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలకి ప్రభాస్ దాదాపు అయిదేళ్ల సమయం కేటాయించాడు. ఈ టైమ్ లో ప్రభాస్ ఇంకో సినిమా సైన్ చేయలేదు. అయిదేళ్లు బాహుబలి ఫ్రాంచైజ్ కి మాత్రమే కట్టుబడి ఉన్న ప్రభాస్, ఆ తర్వాత సాహో సినిమాకి కూడా మూడేళ్లు తీసుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేసింది. దీంతో ట్రాక్ మర్చి ప్రభాస్ లవ్ స్టొరీ “రాధేశ్యామ్” సినిమా చేసాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్, ఓం రౌత్ తో కలిసి చేసిన మాస్టర్ పీస్ ఆదిపురుష్ సినిమా కూడా నెగటివ్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది.

Advertisement

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్… ఈ మూడు సినిమాలు ప్రభాస్ కెరీర్ నుంచి ఆరేళ్ల టైమ్ ని వెస్ట్ చేసాయి కానీ ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాయి. హిట్, ఫ్లాప్ అనేది పక్కన పెడితే మిర్చి, బాహుబలి ఫ్రాంచైజ్, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేసే సమయంలో ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాలకి ప్రభాస్ ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయంలో ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు అదే మిస్ అయ్యింది. ప్రభాస్ అసలు ఏ సినిమా చేస్తున్నాడు? రాజసాబ్ కంప్లీట్ అయ్యిందా? రిలీజ్ ఎప్పుడు అవుతుంది? ఫౌజీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ప్రభాస్ ప్రస్తుతం హను సెట్ లోనే ఉన్నాడా లేక సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న స్పిరిట్ లుక్ టెస్ట్ ఏమైనా చేస్తున్నాడా? లేదా రాజాసాబ్ సినిమా పనుల్లో ఉన్నాడా? అనేది ఎవరికీ తెలియదు. ఫౌజీ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది అనే విషయం మాత్రమే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఉన్న క్లారిటీ, అది తప్ప ఇంకెలాంటి క్లారిటీ ఎవరికీ లేదు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×