Homemade Oil: ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా, మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. కానీ హడావిడి, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల, ఈ కల నెరవేరదు. ఒత్తిడి, అనేక ఇతర కారణాల వల్ల జుట్టు రాలడం సమస్య చాలా సాధారణ సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని జుట్టుకు వాడవచ్చు.
ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇదిలా ఉంటే జుట్టుకు ఉల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి వీటిని జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన అమ్మమ్మల కాలం నుండి ఉల్లిపాయను జుట్టుకు ఉపయోగిస్తున్నారు. మీరు జుట్టు సమస్యలతో బాధపడుతుంటే , రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడకుండా ఉల్లిపాయలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తాయి. నల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉల్లిపాయలను వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
ఉల్లిపాయ రసం, ఆముదం హెయిర్ ఆయిల్ :
ముందుగా ఉల్లిపాయను మెత్తగా కోసి.. దాని నుండి రసాన్ని తీయండి. దీని తరువాత అందులో సమాన పరిమాణంలో ఆముదం నూనె కలపండి. తర్వాత దీనిని 15 నిమిషాల పాటు వేడి చేసి వడకట్టి.. డబ్బాలో నిల్వ చేయండి. అవసరం అయినప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తలపై 10 నిమిషాలు బాగా మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్ :
ముందుగా మీకు కావాల్సినన్ని ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసి దాని రసాన్ని తీయండి. ఈ రసంలో తగిన మోతాదులో ఆలివ్ నూనె కలపండి. దీనిని 10 నిమిషాలు వేడి చేసి వడకట్టి నిల్వ చేసుకోండి. ఈ ఆయిల్‌ను 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. 2 గంటల తర్వాత.. షాంపూతో తలస్నానం చేయండి. మీరు దీన్ని వారానికి 3 సార్లు కూడా ఉపయోగించవచ్చు. దీన్ని తరచుగా ఉపయోగించడం వల్ల చుండ్రు తొలగిపోతుంది . అంతే కాకుండా జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.
Also Read: అల్లం తింటే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
ఉల్లిపాయ రసం యొక్క ప్రయోజనాలు:
ఉల్లిపాయలో అధిక మోతాదులో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలకుండా చేస్తుంది.
జుట్టుకు ఉల్లిపాయ రసం వాడకంతో జుట్టు బలంగా మారుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు పెరుగుదల కూడా మేలు చేస్తుంది .
జాగ్రత్తలు:
మీకు ఏదైనా చర్మ అలెర్జీ ఉంటే, ఉల్లిపాయలను జుట్టుకు వాడకండి.
జుట్టుకు అప్లై చేసే ముందు.. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.