ప్రపంచంలో ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కొన్ని దేశాల ప్రజలు తినే ఆహారం చూస్తే మనకు కడుపులో దేవినట్టు అవుతుంది. ముఖ్యంగా చైనా వాళ్లు తినే ఫుడ్ హాబిట్స్ చూస్తే మనం షాక్ అవుతాం. వాళ్లు తినే కీటకాలు, పాములు, కప్పలు, రకరకాల జీవులను చూస్తే వాక్ అంటాం. మనం డేంజరస్ గా భావించే బొద్దింకలను చైనా వాళ్లు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు, బొద్దింకలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఇంతకీ, బొద్దింకలు తింటే కలిగే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
బొద్దింకలలో బోలెడు పోషకాలు
⦿ అధిక ప్రోటీన్ కంటెంట్
బొద్దింకలలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని జాతులు 60 నుంచి 70% వరకు ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. ఇవి మాంసం, చేపలు, గుడ్లు లాంటి సాంప్రదాయ ప్రోటీన్ కు ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.
⦿ ముఖ్యమైన పోషకాలు
ప్రోటీన్ తో పాటు, బొద్దింకలలో అవసరమైన అమైనో ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సహా పలు సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. ఈ పోషకాలు కండరాల పెరుగుదల, రోగనిరోధక పనితీరుతో పాటు శక్తిని అందిస్తాయి.
⦿ ఔషధ గుణాలు
సాంప్రదాయ చైనీస్ వైద్యంలో చాలా కాలంగా పలు వ్యాధుల చికిత్సకు బొద్దింకలను ఉపయోగిస్తున్నారు. బొద్దింకల నుంచి తీసిన మందులు గాయాలను నయం చేయడం, మంటను తగ్గించడం సహా శ్వాసకోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొద్దింక ఆధారిత చికిత్సలు యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉండవచ్చని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఔషధ పరిశ్రమలో బొద్దింకలను విరివిగా ఉపయోగిస్తున్నారు.
⦿ సంప్రదాయ ఆహారంగా బొద్దింకలు
చైనాలో బొద్దింకలను పొలాలలో పెంచుతారు. వాటిని ఔషధ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. బొద్దింకల నుంచి తీసుకోబడిన పొడులు, టీలు, సారాలు ఆనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపయోగపడుతాయి.
బొద్దింకలు సహా కీటకాలను సాధారణంగా చైనా, థాయిలాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలలో తింటారు. డీప్-ఫ్రై చేసిన, రోస్ట్ చేసిన బొద్దింకలను వీధులలో ఆహారంగా అమ్ముతారు. భిన్నమైన ఆహార పదార్థాలను రుచి చూసేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు.
⦿ పర్యావరణ అనుకూల ఆహారం
పశువుల పెంపకంతో పోలిస్తే, బొద్దింకల పెంపకానికి తక్కువ వనరులు అవసరం. తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచ జనాభా పెరుగుతున్నందున ఆహార స్థిరత్వం ఒక ముఖ్యమైన సమస్యగా మారుతున్నందున, బొద్దింకలతో సహా కీటకాలను ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరుగా మార్చుకునే అవకాశం ఉంది.
⦿ ఆర్థిక ప్రయోజనాలు
చైనాలో బొద్దింకల పెంపకం పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. కొన్ని పొలాల్లో ఔషధ, సౌందర్య సాధన, ఆహార ఉత్పత్తి ప్రయోజనాల కోసం మిలియన్ల కొద్దీ బొద్దింకలను పెంచుతున్నారు. ఈ పరిశ్రమ ఎంతో మందికి ఉద్యోగాలను అందిస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఆర్థిక వృద్ధికి దోహదం పడుతుంది.
మీరు బొద్దింకను తింటారా?
బొద్దింకలను తినడం అనేది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ, తినే వారికి పోషక, ఔషధ ప్రయోజనాలను అందిస్తాయి.
Read Also: వేసవిలో ఫ్రిజ్ అతిగా వాడేస్తున్నారా? ఈ తిప్పలు తప్పవు!