Crime Thriller Movies: తమిళ ఇండస్ట్రీలో ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా క్రైం థ్రిల్లర్ మూవీస్ తమిళంలో బాగా హిట్ అవుతున్నాయి.. ఒకవైపు సినిమాలు క్రైమ్ స్టోరీలు, మరోవైపు కామెడీ చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్ లో రిలీజ్ అయిన ప్రతి మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. తమిళ్ళో ఇప్పటివరకు వచ్చిన ప్రతి మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. తమిళంలో హిట్ అయిన క్రైమ్ సినిమాలు ఏంటో ఒకసారి మనం చూసేద్దాం..
క్రైమ్ 23 మూవీ..
తమిళ స్టార్ హీరో అరుణ్ విజయ్ హీరోగా నటించిన క్రైమ్ 23 మూవీ యూట్యూబ్‌లో 16 మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకున్నది. మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఊహించని మలుపులతో సాగుతుంది.. ఈ మూవీ సస్పెన్స్ లతో సాగుతుంది. ఇప్పటికి ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
రేయికి వెయ్యి కళ్ళు..
అరుళ్‌నిధి, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన రేయికి వేయికళ్లు మూవీ తెలుగులో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.. ఈ మూవీ భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. యూట్యూబ్ లో ఇప్పటికి కూడా క్రేజ్ తగ్గలేదు..
Also Read :ఐదు స్టోరీలతో మూవీ.. క్లైమాక్స్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..
భద్రమ్..
ఇది కూడా తమిళ్ థ్రిల్లర్ మూవీ.. క్రైమ్ కథాంశంతో రూపొందింది. తమిళ్లో తెగిడి అనే టైటిల్తో రిలీజ్ అయింది అదే మూవీ తెలుగులో భద్రం అనే టైటిల్ తో రిలీజ్ అయింది.. అనేక సస్పెన్స్ లతో ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటికీ యూట్యూబ్ లో కూడా అదే ట్రెండ్ ని కొనసాగిస్తుంది..
డేజావు..
తమిళ స్టార్ హీరో అరుణ్ ఇది హీరోగా తెరకెక్కిన తమిళ క్రైమ్ మూవీ డేజావు.. తెలుగులో కూడా అదే టైటిల్తో రిలీజ్ అయింది. తన ప్రియురాలి హత్యకు ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్ రెండు మిలియన్ల వరకు వ్యూస్‌ను దక్కించుకున్నది.. యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సినిమాలకు తమిళ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించడం విశేషం అందుకే ఈ సినిమాలు అప్పటికి ఇప్పటికీ అదే క్రైమ్ సస్పెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి..
తమిళ క్రైమ్ సినిమాలు థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటిటిలోనూ ఇటు యూట్యూబ్లో కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా యూట్యూబ్లో మాత్రం భారీగానే వ్యూస్ ను అందుకుంటున్నాయి. ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపులే ఓటిటిలోకి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.