Coconut Oil For Hair: ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు రావడం, విపరీతంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. వీటివల్ల జుట్టు పెరగడం పక్కన పెడితే చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడంతో పాటు.. తెల్ల జుట్టును కూడా నివారిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
కొబ్బరి నూనె
ఉల్లిపాయ
మెంతులు
అవిసెగింజలు
కలోంజీ సీడ్స్
వేపాకు
కరివేపాకు
గులాబీరేకులు
ఉసిరి
కలబంద
తమలపాకులు
తులసి ఆకులు
లవంగాలు
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కావాల్సినంత కొబ్బరినూనె వేయాలి. అది కాగుతుండగా.. అందులో రెండు టేబుల్ స్పూన్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్ అవిసెగింజలు, రెండు టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, నాలుగు వేపాకులు, ఉసిరి ముక్కలు, కలబంద ముక్కలు, గులాబీ రేకులు, మూడు తమలపాకులను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అందులో 10 లవంగాలు వేయాలి. కొబ్బరి నూనె బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి గాజు సీసాలో వడకట్టుకోండి. ఈ కొబ్బరి నూనెను ప్రతిరోజు జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంతో పాటు.. తెల్లజుట్టు నివారిస్తుంది.. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉపయోగించే పదార్ధాలలో ఉండే విటమిన్స్ జుట్టు పెరుగుదలకు అద్బుతంగా పనిచేస్తుంది. అంతేకాదు.. వీటవల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా.
Also Read: మీ ఫేస్ ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే.. రైస్ క్రీమ్‌తో ఇలా ట్రై చేయండి..
జుట్టు పెరగడం కోసం మరొక చిట్కా..
కావాల్సిన పదార్ధాలు
మందారం ఆకులు
మందారం పువ్వులు
కలోంజి సీడ్స్
మెంతులు
పెరుగు
నిమ్మకాయ
తయారు చేసుకునే విధానం..
ముందుగా మిక్సీజార్‌లో 20 మందారం ఆకులు, మూడు మందారం పువ్వులు, నాలుగు టీస్పూన్లు కలోంజి సీడ్స్, నాలుగు టేబుల్ స్పూన్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ జుట్టు ఒత్తుగా, నడుము వరకు పెరగడం పక్కా. ఈ హెయిర్ మాస్క్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స ఉండవు. తెల్ల జుట్టును కూడా శాశ్వతంగా నివారిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.