Janhvi Kapoor: ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ సినిమాల లిస్ట్ లో కోలీవుడ్ మూవీ అమరన్ ఒకటి. తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మరో స్టార్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్ లో నిర్మించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
మేజర్ ముకుంద్ తన చిన్నతనం నుంచి దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామాన్ని ఉగ్రవాదుల నుండి తొలగించడానికి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా యాంటీ-టెర్రరిస్ట్ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ ప్రాణాలను అర్పించేవరకు ఈ సినిమాలో చూపించారు. మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ కనిపించగా ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటించి మెప్పించింది.
Rajendra prasad: అతడి వల్లే నా కెరియర్ ఆగిపోయింది.. సీనియర్ హీరోయిన్..!
ముఖ్యంగా సాయిపల్లవి నటనకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ముకుంద్ పై ప్రేమను.. ఆయన చనిపోయాక కన్నీరు పెట్టకుండా .. కేవలం ఆమె సైలెన్స్ తోనే ప్రేక్షకులను కంటనీరు పెట్టించింది. ఈ సినిమా కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని చోట్లా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఈ ఏడాది టాప్ 10 సినిమాల లిస్ట్ లో మొదటి వరుసలో చేరింది.
ఇక అమరన్ సినిమాపై ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం తమ రివ్యూలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్స్ అమరన్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దేవర బ్యూటీ జాన్వీ కపూర్ కూడా అమరన్ పై ప్రశంసలు కురిపించింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించింది.
Tollywood Hero’s: ఇండస్ట్రీలో మార్పు మొదలు.. మీరు కూడా గమనించారా..?
” అమరన్ చూడడం ఆలస్యమైంది.. కానీ, ఎంత అద్భుతమైన సినిమా. ప్రతి సన్నివేశం చాలా భావోద్వేగంతో నిండిపోయింది. ఈ ఏడాదిని ఒక మంచి సినిమాతో ముగించాను. అమరన్ సినిమా నా హృదయాన్ని కదిలించింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక జాన్వీ కెరీర్ విషయానికొస్తే.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఈ ఏడాది దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అమ్మడి పాత్ర తక్కువే ఉన్నా .. అమ్మడి అందాలకు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక దేవర తరువాత జాన్వీ.. రామ్ చరణ్ సరసన నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి దేవరతో రానీ స్టార్ హీరోయిన్ స్టేటస్.. రామ్ చరణ్ సినిమాతో జాన్వికి వస్తుందేమో చూడాలి.