BigTV English

Best Deep Frying Cooking Oil: డీప్ ఫ్రై చేసేందుకు బెస్ట్ అండ్ వరస్ట్ వంటనూనెలు ఇవే..!

Best Deep Frying Cooking Oil: డీప్ ఫ్రై చేసేందుకు బెస్ట్ అండ్ వరస్ట్ వంటనూనెలు ఇవే..!

Best Deep Frying Cooking Oil| భారతదేశంలో డీప్ ఫ్రై వంటలు ఇష్టపడేవారు ఎక్కువ. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అందరికీ డీప్ ఫ్రై వంటకాలే కావాలి. అవి మిరపకాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, వడ, బోండా, మైసూరు బజ్జీ ఇలా వెజ్ డీప్ ఫ్రై వంటకాలెన్నో. మరోవైపు చేప ఫ్రై, చికెన్ ఫ్రై వంటకాలు కూడ నోరూరిస్తాయి. అయితే ఈ వంటకాలు తరుచూ తినడం మంచిది కాదని డాక్టర్లు చెబుతుంటారు. ఇంత వరకు అందిరికీ తెలిసిందే కానీ అసలు డీప్ ఫ్రై చేసేందుకు ఏ నూను ఆరోగ్య కరం.. ఏది కాదు అనే విషయం మీకు తెలుసా?..


ఇంట్ల వంట చేసేందుకు డీప్ ఫ్రై వంటనూనె ఎంపిక చాలా ముఖ్యం. ఎందుకంటే వేర్వేరు వంటనూనెలకు వేర్వేరు స్మోకింగ్ పాయింట్స్ ఉంటాయి. స్మోకింగ్ పాయింట్ అంటే ఒక టెంపరేచర్ లెవల్ లో నూనె బ్రేక్ డౌన్ అయిపోతుంది. అప్పుడు నూనె నుంచి పొగ, హానికారక సూక్ష్మ పదార్థాలు వెలువడుతుంటాయి. వంటనూనె స్మోకింగ్ పాయింట్ కు చేరుకున్నప్పుడు దానిలో పౌష్టిక విలువలు కోల్పోయి.. ఆహారంలో కాలిపోయిన ఫ్లేవర్ కూడా చేరుతుంది. అందుకే ఎక్కువ హీట్ అవసమరమయ్యే డీప్ ఫ్రై వంట కోసం సరైన వంటనూనె ఎంచుకోవడం ఆరోగ్యానికి, రుచికర వంట చేయడానికి చాలా కీలకం. అందుకే డీప్ ఫ్రై కోసం ఏ వంటనూనెలు మంచివి ఏవి కావు అనే విషయాన్ని తెలుసుకుందాం.

డీప్ ఫ్రై వంటకాలకు కొన్ని బెస్ట్ వంట నూనెలు ఇవే…

1. రిఫైన్డ్ కోకొనట్ ఆయిల్: కొబ్బరి నూనెలో అద్భుతమైన సాటురేటెడ్ ఫ్యాట్ ఉండడంతో పాటు ఇది ఎంత అధికంగా వేడి చేసినా స్థిరంగా ఉంటుంది. 400 డిగ్రీల ఫారెహీట్ (204 డిగ్రీల సెల్సియస్) టెంపరేచర్ వద్ద రిఫైన్డ్ కొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్. పైగా డీప్ ఫ్రై వంట చేసే సమయంలో ఇది సామాన్యంగా బ్రేక్ డౌన్ కాదు. దీని వల్ల వంట ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఈ నూనెతో చేసిన డీప్ ఫ్రై వంటల చాలా ఆరోగ్యకరం కూడా. ఇందులోని మైల్డ్ టేస్ట్ చాలా వంటకాలకు అదనపు ఫ్లేవర్ ఇస్తుంది.


2. రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్: ఆరోగ్య ప్రయోజనాలకు ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ పెట్టింది పేరు. కానీ ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రై వంటకాలను మంచిది కాదు. అందుకే రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించాలి. దీని స్మోకింగ్ పాయింట్ 465 డిగ్రీ ఫారిన్ హీట్ (240 డిగ్రీ సెల్సియస్). ఇందులో ఆరోగ్యకరమైన మోనోసాటురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ హై స్మోకింగ్ పాయింట్ ఉండడం వల్ల దీన్ని ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫ్రై వంటకాల్లో ఉపయోగిస్తారు.

3. నేయి (ఘీ) : నేయి తో చేసిని డీప్ ఫ్రై వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. నేయి వల్ల ఆరోగ్య లాభాలు కూడా మెండుగా ఉంటాయి. నేయి స్మోకింగ్ పాయింట్ 450 డిగ్రీ ఫారిన్ హీట్ (232 డిగ్రీ సెల్సియస్). అందుకే హై టెంపరేచర్ ఉన్న ఇది సామాన్యంగా బ్రేక్ డౌన్ కాదు. నేయిలోని బుటిరిక్ యాసిడ్ భోజనం డైజెషెన్ కు బాగా ఉపకరిస్తుంది.

4. అవకాడో ఆయిల్: ఆరోగ్యకరమైన వంటనూనెల్లో అవకాడో ఆయిల్ కూడా ఒకటి. డీప్ ఫ్రై వంటకాలకు ఇది మంచి ఆప్షన్. అవకాడో ఆయిల్ స్మోకింగ్ పాయింట్ 520 డిగ్రీ ఫారిన్ హీట్ (271 డిగ్రీ సెల్సియస్). అంటే ఈ వంటనూనె డీఫ్ ఫ్రై వంటకాలకు అత్యధిక టెంపరేచర్ ఉన్నా ఇది బ్రేక్ డౌన్ కాదు. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్ ఎ, డి, ఇ లు ఉన్నాయి.

5. రైస్ బ్రాన్ ఆయిల్, పీనట్ ఆయిల్: పీనట్ ఆయిల్ అంటే వేరు శనగ నూనె. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా డీప్ ఫ్రై వంటకాలకు ఆరోగ్యకరమే. ఈ రెండు నూనెలకు హై స్మోకింగ్ పాయింట్స్ ఉండడం, మోనో సాటురేటెడ్ ఫ్యాట్స్ ఉండడంతో డీప్ ఫ్రైకు ఈ రెండు నూనెలు ఉపయోగపడతాయి.

6. మస్టర్డ్ ఆయిల్ (ఆవాల నూనె): మస్టర్డ్ ఆయిల్ ని దేశ వ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఇరుసిక్ యాసిడ్ గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుందని పశువుల పరిశోధనల్లో తేలింది. మానవులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండడంతో పాటు దీని హై స్మోకింగ్ పాయింట్ ఉండడంతో డీప్ ఫ్రై కోపం దీన్ని ఉపయోగించవచ్చు.

డీప్ ఫ్రై కోసం హానికరమైన వంటనూనె

ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్, సోయాబీన్, కెనోలా ఆయిల్ ఇవన్నీ డీప్ ఫ్రై వంటకాల కోసం ఉపయోగించ కూడదు. ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఇతర వంటకాల కోసం ఉపయోగించవచ్చు. డీప్ ఫ్రై వంటకాల సమయంలో ఇందులోని పాలీ అన్ సాటురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల హానికరమైన ఫీ రాడికల్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఇవి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అందువల్ల డీప్ ఫ్రై కోసం ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్, సోయాబీన్, కెనోలా ఆయిల్స్ ని ఉపయోగించవద్దని నూట్రిషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: వాముతో చిటికెలో జలుబు, దగ్గు మాయం !

Related News

Brown rice Vs White rice: వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్, వీటిలో ఏది బెటర్ ?

Sensitive Teeth:పళ్లు జివ్వుమంటున్నాయా ? ఈ టిప్స్ ట్రై చేయండి

200 Year Old Condom: ఏంటీ.. ఈ కండోమ్ 200 ఏళ్ల నాటిదా? అస్సలు ఊహించి ఉండరు!

Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తినాలి ?

Jaggery water: ఉదయం పూట ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. ?

Pimple Removal Tips: మొటిమలు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Big Stories

×