BigTV English

Road Accident: తీవ్ర విషాదం.. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా ..నలుగురు దుర్మరణం

Road Accident: తీవ్ర విషాదం.. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా ..నలుగురు దుర్మరణం

Madhya Pradesh Road Accident 4 killed: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామోహ్ జిల్లాలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. నలుగురు భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బటియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫతేపూర్ గ్రామ సమీపంలో రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. దామోహ్ జిల్లాలోని ఘుఘాస్ గ్రామానికి చెందిన కొంతమంది భక్తులతో ఛతర్ పూర్ జిల్లాలోని జటాశంకర్‌కు వెళ్తున్నారు.


పఠారియా నుంచి జటాశంకర్‌కు భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పింది. దీంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. హేమేంద్ర(10), ఛోటీ బాయి(45), లక్ష్మణ్(17), గంజ్లీ బహు(50)గా గుర్తించారు. మరో 20మంది గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Also Read: ప్రధాని మోదీకి పాకిస్తాన్ ప్రత్యేక ఆహ్వానం..ఎందుకో తెలుసా?

ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదం జరగడం కలిచివేసిందన్నారు. జిల్లా ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రుల ఆరోగ్యం విషయంసౌ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25వేలు, క్షతగాత్రులకు రూ.10వేలు తక్షణ సహాయం కింద అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×